బద్వేల్ అటవీ ప్రాంతంలో తప్పిపోయిన ఐదేళ్ల బాలుడు: సుమన్ ఆచూకీ లభ్యం, పేరేంట్స్ కి అప్పగింత

By narsimha lode  |  First Published Jan 4, 2023, 11:39 AM IST

కడప జిల్లాలోని బద్వేల్ అటవీ ప్రాంతంలో  తప్పిపోయిన  ఐదేళ్ల బాలుడు సుమన్ ఆచూకీ లభ్యమైంది.  సుమన్  ను ఇవాళ  అటవీశాఖాధికారులు గుర్తించారు . ఐదేళ్ల బాలుడిని  అటవీశాఖ సిబ్బంది పేరేంట్స్ కు అప్పగించారు. 


కడప: జిల్లాలోని బద్వేల్  అటవీ ప్రాంతంలో చిక్కుకున్న ఐదేళ్ల బాలుడి ఆచూకీ బుధవారం నాడు ఉదయం లభ్యమైంది.  ఆ చిన్నారిని  అటవీశాఖాధికారులు  ఇవాళ పేరేంట్స్ కు అప్పగించారు. ఉమ్మడి కడప జిల్లాలోని పోరుమామిళ్ల మండలం  కల్వకుంట్ల కు చెందిన  సుమన్ తండ్రితో  పశువులను మేపేందుకు నిన్న వెళ్లాడు.  పశువులను  మేపుతూ సుమన్  నిన్న సాయంత్రం  అడవిలో దారి తప్పాడు. ఈ విషయమై  సుమన్ తండ్రి అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు.  అటవీశాఖాధికారులు , గ్రామస్తులు  నిన్న రాత్రి నుండి సుమన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం నాడు రాత్రంతా  బద్వేల్ అటవీ ప్రాంతంలోనే  సుమన్  ఉన్నాడు.  బాలుడి కోసం  గాలిస్తున్న  బృందానికి  ఇవాళ  ఉదయం అతను కన్పించాడు. చలికి సుమన్  వణికిపోతండడం  గుర్తించినట్టుగా  అటవీశాఖ సిబ్బంది చెప్పారు.  సుమన్ ను  తల్లిదండ్రులకు అప్పగించారు.  

click me!