కాకినాడలో అగ్ని ప్రమాదం : రూ. 2 కోట్ల ఆస్తి నష్టం

Published : Jun 19, 2019, 08:42 AM IST
కాకినాడలో అగ్ని ప్రమాదం : రూ. 2 కోట్ల ఆస్తి నష్టం

సారాంశం

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని ఓ సూపర్‌ మార్కెట్‌లో బుధవారం తెల్లవారుజామున  భారీ అగ్నిప్రమాదం జరిగింది. 


కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని ఓ సూపర్‌ మార్కెట్‌లో బుధవారం తెల్లవారుజామున  భారీ అగ్నిప్రమాదం జరిగింది.  షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి మూడంతస్తులకు వ్యాపించినట్టుగా అనుమానిస్తున్నారు.ఈ ప్రమాదంలో సుమారు రూ. 2 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు.

పెద్దాపురం, పిఠాపురం నుండి నాలుగు అగ్నిమాపక వాహనాలను తెప్పించి  మంటలను ఆర్పుతున్నారు. ఈ భవనం నుండి చుట్టుపక్కలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. 

సూపర్ మార్కెట్ లో ప్లాస్టిక్ వస్తువులు, స్కూల్ బ్యాగులు, దుస్తులు ఎక్కువగా ఉన్న కారణంగా మంటల తీవ్రత పెరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan Health Update: చికిత్స కోసం ముంబై వెళ్లిన పవన్ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే?
Cyclone alert: బంగాళాఖాతంలో తుపాను..? ఈ జూలైలో జోరువానలు? | Heavy rains AP | Asianet News Telugu