ఉమ్మడి విజయనగరం జిల్లాలోని సీతానగరంలో తండ్రీ కొడుకులపై ఏనుగు దాడి చేసింది. ఈ ఘటనలో తండ్రీ కొడుకులు గాయపడ్డారు.
విజయనగరం:;ఉమ్మడి విజయనగరం జిల్లాలోని సీతానగరం వద్ద తండ్రీ కొడుకులపై ఏనుగు దాడి చేసింది. ఈ దాడిలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రిలో చేర్పించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏనుగుల గుంపులు దాడి చేస్తున్నాయి.పంట పొలాలపై గజరాజులు విధ్వంసానికి పాల్పడుతున్నాయి. ఏనుగుల దాడితో పచ్చని పంటపొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంటపొలాలను నాశనం చేస్తున్న ఏనుగులను అడవిలోకి పంపేందుకు వచ్చిన అటవీశాఖాధికారులు కూడ ఏం చేయలేకపోతున్నారని స్థానికులు చెబుతున్నారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలోని బలిజపేట మండలం గంగులువాని చెరువు వద్ద రెండుఆవునుల ఏనుగులు తొక్కి చంపాయి. ఈ ఘటన గత నెల 21న చోటు చేసుకుంది.
ఈ ఏడాది జనవరి 10వ తేదీన జిల్లాలోని కొమరాడ మండలం దుగ్గి గ్రామంలో అటవీశాఖలో పనిచేస్తున్న రాజు ను ఏనుగు తొక్కి చంపింది.గత నాలుగేళ్లుగా ఏనుగుల దాడిలో విజయనగరం జిల్లాలో నలుగురు మృతి చెందారు.
undefined
2019 డిసెంబర్ 6నమహిళ పై ఏనుగు దాడి చేయడంతో ఆమె మరణించింది.జియ్యమ్మవలస మండలం బాసంగి గ్రామానికి చెందిన గంట చిన్నమ్మి వరికోతకు వెళ్లింది .ఏనుగుల గుంపు దాడి చేయడంతో ఆమె మృతి చెందింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు, శ్రీకాకుళం,విజయనగరం జిల్లాలో ఏనుగులు పంట పొలాలపై దాడి చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న గ్రామాలపై ఏనుగులు దాడి చేస్తున్నాయి. ఏనుగులతో పాటు ఎలుగుబంట్లు కూడ పంటపొలాలపై దాడి చేస్తున్నాయి.ఏనుగులు, ఎలుగుబంట్ల భయంతో పొలాల వద్దకు వెళ్లడానికి కూడ స్థానికులు భయపడుతున్నారు.