రెండువేల కోసం తండ్రీ కుమారుల దాడి, వార్డు వాలంటీర్ మృతి...

By SumaBala BukkaFirst Published May 20, 2022, 1:43 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు ఓ తండ్రీ కొడుకులు వార్డు వాలంటీర్ మీద దాడికి దిగారు. దీంతో వాలంటీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. 

తెనాలి :  తన దగ్గర  తీసుకున్న money తిరిగి ఇవ్వమన్నందుకు ward volunteerపై తండ్రి, కుమారుడు దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలోని మారిస్ పేటలో చోటు చేసుకుంది. ఈ attackలో వాలంటీర్  అక్కడికక్కడే  కుప్పకూలి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… తెనాలి పట్టణంలోని 24వ వార్డు వాలంటీర్ గా పనిచేస్తున్న సందీప్ (22) నుంచి ఓ మైనర్ బాలుడు 2 నెలల క్రితం రూ. 2000 అప్పుగా తీసుకున్నాడు. ఆ తరువాత ఇవ్వలేదు. దీంతో తనకు డబ్బులు అవసరమయ్యాయి అని..  తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని వాలంటీర్ అడగగా బాలుడు దురుసుగా ప్రవర్తించాడు.  

ఈ క్రమంలో గొడవ జరిగింది. తీసుకునేప్పుడు బాగానే తీసుకుని.. ఇవ్వమనగానే గొడవకు దిగడంతో వాలంటీర్ కూడా కోపంగా మాట్లాడాడు. దీంతో మాటా మాటా పెరిగి ఇరువైపులా దాడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బాలుడికి నచ్చజెప్పాల్సిన అతడి తండ్రి వెంకటేశ్వర్లు కూడా.. వాలంటీర్ పైనే విరుచుకుపడ్డాడు. అలా తండ్రీకొడుకులిద్దరూ సందీప్ గుండెలపై బలంగా కొట్టడంతో..  అతను అక్కడికక్కడే కుప్పకూలాడు. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన సందీప్ ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సందీప్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.  

దీంతో మృతదేహాన్ని బంధువులు మారిస్ పేటలోని తమ ఇంటికి తీసుకువెళ్లారు. సందీప్ తండ్రి ఇదివరకే మృతిచెందాడని… తల్లికి మాటలు రావు అని స్థానికులు తెలిపారు. కుటుంబ పోషణ భారం మొత్తం సందీపే చూసుకుంటున్నాడు అని..  ఓ పక్క వాలంటీర్ గా ఉంటూ ఖాళీ సమయాల్లో ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు అని తెలిపారు. సందీప్ మరణంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సందీప్ మృతికి కారణమైన తండ్రీ కొడుకుల మీద పోలీసులు విచారణ చేపట్టారు. 

ఇధిలా ఉండగా, Family disputes నేపథ్యంలో చోటు చేసుకున్న వివాదంలో తండ్రితో పాటు కుటుంబ సభ్యులు దాడి చేయడంతో కొడుకు murderకు గురైన సంఘటన పర్చూరు మండలం ఏదుబాడులో చోటుచేసుకుంది. సంఘటన స్థలంలో Blood stains చెరిపివేసి Suicideగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చివరికి పోలీసుల రంగప్రవేశంతో హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్సై లక్ష్మీ భవాని తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పొనుగుపాటి ఏసురత్నం (28)  అదే గ్రామానికి చెందిన నీలిమ ప్రియాంకను 2014లో love marriage చేసుకున్నాడు. మొదట్లో ఏసురత్నం కుటుంబ సభ్యులు దీనికి వ్యతిరేకించినా.. కొంతకాలం తర్వాత కలిసిపోయారు.

 నీలిమ, ఏసురత్నం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. మద్యానికి అలవాటుపడిన ఏసురత్నం భార్య, కుటుంబ సభ్యులను తరచూ వేధిస్తుండేవాడు. ఈ నెల 15న మద్యం సేవించి గొడవ చేయడంతో భార్య ఏదుబాడు వచ్చింది.  17న తల్లితో కలిసి మేదరమెట్లలో ఉంటున్న సోదరి వద్దకు వెళ్ళింది. భార్యను తీసుకురావడానికి తండ్రిని రమ్మని కోరాడు ఏసురత్నం. మద్యం సేవించి గొడవ పడుతూ ఉంటే.. ఏ భార్య అయినా ఎలా వస్తుందని.. ఏ మొహం పెట్టుకుని మేమైనా నీతో ఎలా రావాలని తండ్రి అనడంతో  వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్తా చిలికి చిలికి గాలివానలా మారింది. ఈ క్రమంలో కుమారుడిపై తండ్రి తో పాటు కుటుంబ సభ్యులు దాడి చేశారు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.

తల, ఇతర శరీర భాగాలలో బలమైన గాయాలు కావడంతో  కొద్దిసేపటికే ఏసురత్నం మృతిచెందాడు. అయితే, రక్తపు మరకలు కావడం అనుకోకుండా చనిపోవడంతో కుటుంబసభ్యులు భయపడ్డారు. హత్య చేసినట్లు అనుమానం వస్తుందని భయంతో  శరీరంపైనా, గదిలోనూ కనిపించకుండా రక్తపు మరకలు తుడిచేశారు. మేదరమెట్లలో ఉంటున్న మృతుని భార్య నీలిమా  ప్రియాంకకు గురువారం సాయంత్రం ఫోన్ చేసి పురుగుల మందు తాగి చనిపోయినాడు అని ఆమె మామ సమాచారం అందించాడు.  దీంతో కంగారుగా బంధువులతో కలిసి గ్రామానికి వచ్చి శరీరంపై ఉన్న గాయాలు చూసి ఆందోళన పడి  నిలదీసింది.

click me!