ఏపీ పీసీసీ చీఫ్ గా పళ్లంరాజు..?

By Nagaraju penumalaFirst Published Aug 3, 2019, 2:45 PM IST
Highlights

అనంతరం 2009లో జరిగిన ఎన్నికల్లో మూడోసారి కూడా గెలుపొందారు. మళ్లీ మన్మోహన్ సింగ్ కేబినెట్ లో రక్షణ మంత్రిగా కొనసాగారు. అయితే 2012లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో రక్షణ శాఖ మంత్రి నుంచి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా మాజీకేంద్రమంత్రి మల్లిపూడి మంగపతి పళ్లంరాజు నియమితులైనట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్  పదవికి ఇటీవలే రఘువీరారెడ్డి రాజీనామా చేశారు. ఆరు నెలల పాటు తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన పళ్లంరాజు కాకినాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి పలుమార్లు గెలుపొందారు. 1989లో కాకినాడ లోక్ సభ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 1995లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. 

1997నుంచి అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఇకపోతే 2004 ఎన్నికల్లో రెండోసారి లోక్ సభకు కాకినాడ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం మన్మోహన్ సింగ్ కేబినెట్ లో 2006 నుంచి 2009 వరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. 

అనంతరం 2009లో జరిగిన ఎన్నికల్లో మూడోసారి కూడా గెలుపొందారు. మళ్లీ మన్మోహన్ సింగ్ కేబినెట్ లో రక్షణ మంత్రిగా కొనసాగారు. అయితే 2012లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో రక్షణ శాఖ మంత్రి నుంచి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 

ఇకపోతే మల్లిపూడి మంగపతి పళ్లంరాజు కుటుంబం కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయులుగా పేరుంది. పళ్లంరాజు తండ్రి శ్రీరామ సంజీవరావు కూడా మూడుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన కుటుంబం చేసిన కృషికి గాను పీసీసీ చీఫ్ గా అవకాశం కల్పించారని తెలుస్తోంది.  

 

click me!