చంద్రబాబు బాగుండాలనేదే పవన్ లక్ష్యం.. ఆయనను ప్రజలు ఎందుకు నమ్మాలి?: పేర్ని నాని

Published : Mar 13, 2023, 05:27 PM ISTUpdated : Mar 13, 2023, 05:34 PM IST
చంద్రబాబు బాగుండాలనేదే పవన్ లక్ష్యం.. ఆయనను ప్రజలు ఎందుకు నమ్మాలి?: పేర్ని నాని

సారాంశం

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాన్ నాలుకకు నరం ఉండదని విమర్శించారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాన్ నాలుకకు నరం ఉండదని విమర్శించారు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. కాపులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కలిస్తే ఈ ప్రభుత్వం మారిపోతుందని అంటున్నాడని.. అసలు ప్రభుత్వం ఎందుకోసం మారాలి? ఎవరి కోసం మారాలని ప్రశ్నించారు. ఎవరి చేతుల్లోకి అధికారం వెళ్లేందుకు ఈ ప్రభుత్వం మారాలని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం పనిచేస్తుందే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల, అగ్రవర్ణాల పేదల కోసమేనని అన్నారు. వాళ్ల ప్రభుత్వాన్ని వాళ్లు ఎందుకు మార్చుకుంటారని అన్నారు. చంద్రబాబు బాగుండాలనేదే పవన్ అంతిమ లక్ష్యమని విమర్శించారు. 

జనసేన పార్టీ అవిర్బావ దినోత్సవాన్ని కూడా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ మాదిరిగా జరుపుతున్నారని విమర్శించారు. ఇప్పటం సభ జరిగి ఏడాది తర్వాత పవన్ కల్యాణ్ ఇప్పుడు మళ్లీ వచ్చారని విమర్శించారు. కాపుల కోసం పవన్ ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. కాపులు, బలిజలు వేరని పవన్‌కు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. సిద్దాంతాలు లేని, ఓ లక్ష్యం లేని  వ్యక్తి పవన్ కల్యాణ్ అని విమర్శించారు. ఏ సిద్దాంతాన్ని చూసి పవన్‌ను ప్రజలు నమ్మాలని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఉపన్యాసాలు అన్నీ సినిమా డైలాగ్సేనని విమర్శించారు. 

జగన్ దత్తపుత్రుడు అని అంటే పవన్ కల్యాణ్‌కు విపరీతమైన పౌరుషం వస్తుందని.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రూ. వెయ్యి కోట్లకు బేరం జరుగుతుందని రాస్తే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పవన్ ఎందుకు ప్రశ్నించకుండా.. రాజకీయాలకు డబ్బులు ఎందుకని మాట్లాడటం చూస్తే చంద్రబాబు కోసం పని చేస్తున్నారనే విషయం అర్థమవుతుందని అన్నారు. 

రాజకీయ అవసరాల కోసం ఇష్టారీతిన పవన్ కల్యాణ్ అబద్దాలు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ప్రజల కోసం అన్నీ త్యాగాలు చేశానన్న పవన్ కల్యాణ్.. మళ్లీ సినిమాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌లో నిజాయితీ ఉంటే కులం గురించి ఎందుకని ప్రశ్నించారు. సీఎం జగన్ ఎప్పుడైనా ఆయన కులం ఇది అని చెప్పారా? అని ప్రశ్నించారు. ప్రజా సేవ పట్ల చిత్తశుద్ది ఉంటే.. రాజకీయ నాయకుడికి ఏ కులం అయితే ఏమిటని? అన్నారు. ప్రజలల్లో నమ్మకం కలిగితినే.. ప్రజలు ఓట్లు వేస్తారని చెప్పారు. హరిరామజోగయ్యకు పవన్ కల్యాణ్ టోపి పెట్టారని.. ఆయన అమాయకుడెమో గానీ.. ప్రజలు అమాయకులు కాదని అన్నారు. 2024 మార్చి వరకు పవన్ కల్యాణ్ ముసుగు తీయాల్సిందే కదా అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల రంగు బయట పడాల్సిందేనని అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే