ఎన్టీఆర్ పై నాందెడ్ల షాకింగ్ కామెంట్స్

Published : Jan 28, 2019, 02:37 PM IST
ఎన్టీఆర్ పై నాందెడ్ల షాకింగ్ కామెంట్స్

సారాంశం

సినీ నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పై ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు సంచలన కామెంట్స్ చేశారు. 

సినీ నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పై ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు సంచలన కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ఆయన కుమారుడు బాలకృష్ణ ‘‘ఎన్టీయార్-కథానాయకుడు’’, ఎన్టీయార్ -మహానాయకుడు సినిమాని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

కాగా.. మొదటి పార్ట్ ఇప్పటికే విడుదల అవ్వగా.. రెండో పార్ట్.. త్వరలో విడుదల కానుంది. ఈ రెండో పార్ట్ లో నాదెండ్ల భాస్కరరావు పాత్ర కూడా ఉంది. కాగా.. ఈ సినిమాలో తనను నెగిటివ్ గా చూపిస్తారంటూ మొదటి నుంచి మొత్తుకుంటున్న నాదెండ్ల.. మరోసారి కామెంట్స్ చేశారు.

ఎన్టీఆర్ తో తెలుగుదేశం పార్టీ పెట్టించడమే తాను చేసిన అతి పెద్ద పొరపాటు అని నాదెండ్ల భాస్కరరావు అభిప్రాయపడ్డారు. అనంతరం చంద్రబాబుపై కూడా విమర్శలు చేశారు. చంద్రబాబు విదేశీ పర్యటనల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీతో మాటిమాటికీ తగువులు పెట్టుకోవడం ద్వారా చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

చంద్రబాబు.. బీసీ ప్రధానిని విమర్శిస్తూ..బీసీ సమావేశాలు పెట్టడం గర్హనీయమన్నారు. ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే