భూమా అఖిలప్రియకు షాక్: వైసిపిలోకి ఇరిగెల సోదరులు

Published : Feb 16, 2019, 08:22 AM IST
భూమా అఖిలప్రియకు షాక్: వైసిపిలోకి ఇరిగెల సోదరులు

సారాంశం

ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరులు శనివారం వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు. వారితో పాటు వారి అనుచరులు కూడా వైసిపిలో చేరనున్నారు. 

ఆళ్లగడ్డ: మంత్రి భూమా అఖిలప్రియకు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో షాక్ ఇవ్వడానికి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పక్కా ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆళ్లగడ్డలోని ముఖ్య నేతలను ఆకర్షించే పని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 

ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరులు శనివారం వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు. వారితో పాటు వారి అనుచరులు కూడా వైసిపిలో చేరనున్నారు. 

ఆళ్లగడ్డకు చెందిన రాంపుల్లారెడ్డి సోదరులు భూమా అఖిలప్రియకు వ్యతిరేక వర్గానికి చెందినవారనే పేరుంది. వారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. 

ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ ప్రత్యర్థి వర్గాలు ఏకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది ఆమెకు పెద్ద సవాల్ విసిరే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్..కుండపోత వర్షాలతో ఇక అల్లకల్లోలమే | AP Telangana Weather Alert
IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలతో అల్లకల్లోలమే, ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్