జగన్ కి వ్యక్తిగతంగా సహకరిస్తా: మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్

By Nagaraju penumalaFirst Published 27, May 2019, 5:54 PM IST
Highlights

అవినీతికి వ్యతిరేకంగా జగన్ పనిచేస్తే తాను సహకరిస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పును తాము గౌరవిస్తున్నామని తెలిపారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓటమికి పార్టీ నేతలంతా బాధ్యత వహిస్తున్నట్లు తెలిపారు. 

అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచలు ఇస్తామని తెలిపారు. 

అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన అవినీతికి వ్యతిరేకంగా జగన్ పనిచేస్తే తాను సహకరిస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పును తాము గౌరవిస్తున్నామని తెలిపారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓటమికి పార్టీ నేతలంతా బాధ్యత వహిస్తున్నట్లు తెలిపారు. 

తమ అధినేత చంద్రబాబు నాయుడు సూచనలను, పథకాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లలేకపపోయామని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమన్న ఆయన టీడీపీ నేతలు నిరాశ చెందొద్దన్నారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో చాలా చోట్ల టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని రాజకీయ కక్ష సాధింపు చర్యలు సరికాదని డొక్కా మాణిక్య వరప్రసాద్ హితవు పలికారు. ఈ తరహాదాడులు జరగకుండా ప్రభుత్వం యంత్రాంగం పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  

Last Updated 27, May 2019, 5:54 PM IST