కృష్ణా జిల్లాలో అతిసార కలకలం.. ఒకరి మృతి, మరో 15 మందికి అస్వస్థత

Siva Kodati |  
Published : May 01, 2022, 07:26 PM IST
కృష్ణా జిల్లాలో అతిసార కలకలం.. ఒకరి మృతి, మరో 15 మందికి అస్వస్థత

సారాంశం

కృష్ణా జిల్లాలో అతిసార కలకలం రేపుతోంది. పామర్రు మండలం బల్లిపర్రులో డయేరియా కారణంగా ఒక వృద్ధులు మరణించగా.. మరో 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు గ్రామంలో నీటి సరఫరా వ్యవస్థను పరిశీలిస్తున్నారు. 

కృష్ణా జిల్లా (krishna district) పామర్రు (pamarru) మండలం బల్లిపర్రులో (balliparru) అతిసార ప్రబలుతోంది. ఇప్పటికే ఒక మహిళ కూడా మృతి చెందింది. మరో 15 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  68 ఏళ్ల కలపాలా అలివేలు మంగమ్మకు డయేరియా సోకడంతో మూడు రోజులుగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇవాళ పరిస్థితి విషమించడంతో విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ఆదివారం ప్రాణాలు కోల్పోయారు. పామర్రు టీడీపీ ఇన్‌ఛార్జ్ కుమార్ రాజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఆర్డీవో, ఇతర వైద్యాధికారులు బల్లిపర్రుకు చేరుకుని పరిశీలించారు. మంచినీటి పైపులైన్‌కు లీకేజీలు ఉండటంతో మురుగు నీరు కలిసినట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : సంక్రాంతి సెలవులు మరో రెండ్రోజులు పొడిగిస్తారా..?
IMD Weather Update : కనుమ రోజు కనువిందు చేసే వెదర్.. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం