చంద్రబాబు నివాసానికి జగన్ ఎసరు.. అధికారుల నోటీసులు

By telugu teamFirst Published Jun 28, 2019, 9:24 AM IST
Highlights

కృష్ణా నది కరకట్ట పై నిర్మించిన అక్రమ నిర్మాణాలను పూర్తి కూల్చివేసేందుకు జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే..  ప్రజా వేదికను అధికారులు కూల్చివేశారు.


కృష్ణా నది కరకట్ట పై నిర్మించిన అక్రమ నిర్మాణాలను పూర్తి కూల్చివేసేందుకు జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే..  ప్రజా వేదికను అధికారులు కూల్చివేశారు. కాగా... ఇప్పుడు ఇతర అక్రమ కట్టడాలపై అధికారులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి సీఆర్డీఏ అధికారులు నోటీసులు  జారీ చేశారు.

చంద్రబాబు నివాసంతోపాటు మరో 20 అక్రమ నిర్మాణాల యజమానులకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు తగిన సమయంలోగా ఆ అక్రమ నిర్మాణాల యజమానులు స్పందించాల్సి ఉంటుంది. ఈ నోటీసులకు వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని అధికారులు పేర్కొన్నారు.  స్పందించకపోతే.. ప్రజా వేదికను కూల్చివేసిటనట్లుగానే వీటిని కూడా కూల్చే స్తామని అధికారులే స్వయంగా చెప్పారు.

ఇప్పటికే ప్రజా వేదికను కూల్చడాన్ని టీడీపీ నేతలు తప్పు పడుతున్నారు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నివాసానికే జగన్ ఎసరు పెట్టారు. మరి దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇదిలా ఉంటే... ఇప్పుడు ఉంటున్న నివాసాన్ని ఖాళీ చేసి.. వేరే నివాసంలోకి వెళ్లేందుకు ఇప్పటికే చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. 

click me!