సీపీఐ నారాయణకు భార్యా వియోగం

Siva Kodati |  
Published : Apr 14, 2022, 06:31 PM ISTUpdated : Apr 14, 2022, 10:12 PM IST
సీపీఐ నారాయణకు భార్యా వియోగం

సారాంశం

సీపీఐ నారాయణ సతీమణి వసుమతి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు

సీపీఐ నారాయణ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి వసుమతి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న పలు పార్టీల నేతలు నారాయణ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

వసుమతి దేవి పార్థివదేహం శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 3 గంటల వరకు ప్రజల సందర్శనార్థం తిరుపతి బైరాగి పట్టెడ సిపిఐ కార్యాలయంలో ఉంచుతామని పార్టీ తెలిపింది. అనంతరం మూడు గంటలకు ఆమె పార్థివ దేహాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం మెడికల్ కాలేజీకి అప్పగించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

ఇది బాబుగారి మాటగా చెబుతున్న | Atchennaidu On Local Body Elections | Asianet News Telugu
Heavy Rain Alert : బంగాళాఖాతంలో తుపాను లోడ్ అవుతోందా? ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలతో అల్లకల్లోలం తప్పదా?