ఆంధ్రప్రదేశ్‌లో 80 శాతం గ్రీన్‌జోనే: సీఎం జగన్

By Siva KodatiFirst Published Apr 27, 2020, 6:21 PM IST
Highlights

దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీ ఒక్కటేనని జగన్ స్పష్టం చేశారు. దేశం మొత్తం మీద 10 లక్షల జనాభాకు 451 టెస్టులు చేస్తున్నారని.. ఇదే సమయంలో ఏపీలో సగటున 1,396 కరోనా పరీక్షలు జరుగుతున్నాయని జగన్ వెల్లడించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్టింగ్ సామర్ధ్యం పెంచామన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సోమవారం ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఇలాంటి విపత్తులు వస్తే పరీక్షించే సదుపాయాలు లేవన్నారు.

దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీ ఒక్కటేనని జగన్ స్పష్టం చేశారు. దేశం మొత్తం మీద 10 లక్షల జనాభాకు 451 టెస్టులు చేస్తున్నారని.. ఇదే సమయంలో ఏపీలో సగటున 1,396 కరోనా పరీక్షలు జరుగుతున్నాయని జగన్ వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా 9 చోట్ల కరోనా టెస్టింగ్ కేంద్రాలు, 9 వీఆర్‌‌డీఎల్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో 54 మండలాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయని, దాదాపు 80 శాతం రాష్ట్రం గ్రీన్‌జోన్‌లో ఉందని జగన్ వెల్లడించారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 74,551 మందికి టెస్టులు నిర్వహించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇదే సమయంలో కేవలం 63 మండలాలు మాత్రమే రెడ్‌జోన్‌లో ఉన్నాయని.. లాక్‌డౌన్‌కు సహకరిస్తున్న ప్రజలకు జగన్ ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్రంలో 5 క్రిటికల్‌కేర్ ఆసుపత్రులను ఏర్పాటు చేశామని, ప్రతి హాస్పిటల్‌లో ఎన్ 95 మాస్కులు ఉన్నాయని సీఎం వెల్లడించారు. ఈ నెలలోనే టెస్టింగ్ కెపాసిటీ పెంచుతున్నామని, 44 ట్రూ నాట్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశామని జగన్ పేర్కొన్నారు. 40 వేల బెడ్స్‌లో 25 వేలు సింగిల్ ఐసోలేషన్ బెడ్స్ ఉన్నాయని ఆయన తెలిపారు. 

click me!