కృష్ణా జిల్లా అయ్యంకిలో దారుణం: దంపతుల దారుణ హత్య

Published : Sep 21, 2023, 03:04 PM ISTUpdated : Sep 21, 2023, 03:15 PM IST
కృష్ణా జిల్లా అయ్యంకిలో దారుణం: దంపతుల దారుణ హత్య

సారాంశం

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అయ్యంకి గ్రామంలో దంపతులను  ప్రత్యర్థులు హత్య చేశారు. 

విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లా మొవ్వ మండలం అయ్యంకి  గ్రామంలో గురువారంనాడు దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై దంపతులను హత్య చేశారు.
వీరంకి వరలక్ష్మి, వీరంకి వీరకృష్ణ పై ప్రత్యర్థులు నడిరోడ్డుపై దాడి చేశారు. ఈ దాడిలో దంపతులు  అక్కడికక్కడే మృతి చెందారు. పాతకక్షల నేపథ్యంలో  ఈ దాడి జరిగినట్టుగా  అనుమానిస్తున్నారు పోలీసులు.  తన సోదరుడు గణేష్ కుటుంబంతో వీరకృష్ణకు  గొడవలున్నాయి. దీంతో  వీరకృష్ణ సోదరుడి కొడుకులు  వీరకృష్ణను ఆయన భార్య వరలక్ష్మిని హత్య చేశారని  పోలీసులు ప్రకటించారు. సంఘటన స్థలానికి కూచిపూడి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

నిమిషాల వ్యవధిలో దంపతులు హత్యకు గురికావడం గ్రామంలో కలకలం రేపింది.  గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వీరంకి వీరకృష్ణను పంచాయితీ కార్యాలయం వద్ద ప్రత్యర్థులు హత్య చేశారు.ఆ తర్వాత అతడి భార్య వరలక్ష్మిని నడిరోడ్డుపై హత్య చేసినట్టుగా స్థానికులు పోలీసులకు చెప్పారు. ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షుల నుండి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. భార్యాభర్తలను హత్య చేసిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు