గ్యాస్ సిలిండర్‌ పేలుడు: దంపతులకు గాయాలు

Published : Dec 07, 2020, 03:53 PM ISTUpdated : Dec 07, 2020, 03:58 PM IST
గ్యాస్ సిలిండర్‌ పేలుడు: దంపతులకు గాయాలు

సారాంశం

నగరంలోని ప్రసాదంపాడులో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది.ఈ ఘటనలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి ఇంటి పైకప్పు ఎగిరి రోడ్డుపై పడింది. 

విజయవాడ: నగరంలోని ప్రసాదంపాడులో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది.ఈ ఘటనలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి ఇంటి పైకప్పు ఎగిరి రోడ్డుపై పడింది. 

గాయపడిన దంపతులను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు.  గ్యాస్ సిలిండర్ పేలుడుకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇంటి పై కప్పు ఎగిరి రోడ్డుపై పడడంతో ప్రమాదతీవ్రతకు అద్దం పడుతోంది. 

గ్యాస్ సిలిండర్ పేలుడుకు నిర్లక్ష్యమే కారణమా.. ఇతరత్రా కారణాలపై ఆరా తీస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలు గతంలో అనేకం చోటు చేసుకొన్నాయి. గ్యాస్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదాలు జరుగుతాయని అగ్నిమాపక శాఖాధికారులు చెబుతున్నారు. 

ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలాాన్ని పరిశీలించారు. ఘటనకు గల కారణాలపై స్థానికుల నుండి ఆరా తీస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలు.. ఎలా ఉండనున్నాయో తెలుసా..?
IMD Rain Alert : ఎల్ నినో వచ్చేస్తోంది .. తెలుగు ప్రజలారా.. ఇక కాస్కొండి..!