తిరుపతి లాడ్జీలో జంట సూసైడ్: కోవూరు వాసులుగా గుర్తింపు

Published : Nov 08, 2022, 02:02 PM IST
తిరుపతి లాడ్జీలో జంట సూసైడ్: కోవూరు వాసులుగా గుర్తింపు

సారాంశం

తిరుపతిలోని లాడ్జీలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. కోవూరుకు చెందిన అనూష,కృష్ణారావులు తిరుపతికి వచ్చి సూసైడ్ చేసుకున్నారు. 


తిరుపతి:ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలోని త్రిలోక లాడ్జీలో అనూష,కృష్ణారావులు ఆత్మహత్య  చేసుకున్నారు.నిన్ననే వీరిద్దరూ తిరుపతిలోని త్రిలోక లాడ్జీలో గదిని అద్దెకు తీసుకున్నారు. ఇవాళ ఉదయం లాడ్జీని ఖాళీ చేయాల్సి ఉంది. గదిని ఖాళీ చేయించేందుకు లాడ్జీ సిబ్బంది రూమ్ తలుపులు కొడితే లోపల నుండి  సమాధానం రాలేదు. దీంతో  లాడ్జీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. లాడ్జీ రూమ్ తలుపులు పగులకొట్టి చూస్తే లాడ్జీ గదిలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అనూషది ,కృష్ణారావుది కోవూరుగా పోలీసులు గుర్తించారు. అనూష అదృశ్యమైనట్టుగా కోవూరు పోలీస్ స్టేషన్ లో  పిర్యాదు అందిందని తిరుపతి పోలీసులు చెబుతున్నారు.లాడ్జీలో లభించిన పోన్ ఆధారంగా మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్టుగా పోలీసులు చెప్పారు.ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులుతెలిపారు. అనూష, కృష్ణారావులు ఎందుకు ఆత్మహత్య  చేసుకున్నారనే విషయమై దర్యాప్తు చేస్తున్నామని  పోలీసులు తెలిపారు.కుటుంబ సభ్యులను విచారిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని తిరుపతి   పోలీసులు చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం
అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu