ఏపిలో కరోనా ఉధృతి: కొత్తగా 56 పాజిటివ్ కేసులు, మొత్తం సంఖ్య 813

Published : Apr 22, 2020, 11:36 AM IST
ఏపిలో కరోనా ఉధృతి: కొత్తగా 56 పాజిటివ్ కేసులు, మొత్తం సంఖ్య 813

సారాంశం

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి కొనసాగుతోంది. తాజాగా గత 24 గంటల్లో 56 కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ కేసులన్నీ ఆరు జిల్లాల్లోనే నమోదయ్యాయి.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 56 పెరిగాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 813కు చేరుకుంది. గత 24 గంటల్లో ఇద్దరు మరణించారు. దీంతో మరణాల సంఖ్య 24కు చేరుకుంది.

గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. తాజాగా గత 24 గంటల్లో గుంటూరు జిల్లాలో 19 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 177కు చేరుకుంది. దాంతో కరోనా వైరస్ కేసులు నమోదైన జిల్లాల్లో గుంటూరు రెండో స్థానంలో కొనసాగుతోంది. కర్నూలు జిల్లా 203 కేసులతో అగ్రస్థానంలో సాగుతోంది.

గత 24 గంటల్లో కొత్తగా ఆరు జిల్లాల్లోనే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగాయి. చిత్తూరు జిల్లాలో ఆరు, గుంటూరు జిల్లాలో 19, కడప జిల్లాలో 5, కృష్ణా జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 19, ప్రకాశం జిల్లాలో నాలుగు కేసులు కొత్తగా నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది 120 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 669 రోగులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ కారణంగా అనంతపురం జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో 8 మంది, కృష్ణా జిల్లాలో ఆరుగురు, కర్నూలు జిల్లాలో ఐదుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు మరణించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఏ విధమైన కేసులు కూడా నమోదు కాలేదు.

జిల్లాలవారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది...

అనంతపురం 36
చిత్తూరు 59
తూర్పు గోదావరి 26
గుంటూరు 177
కడప 51
కృష్ణా 86
కర్నూలు 203
నెల్లూరు 67
ప్రకాశం 48
విశాఖపట్నం 21
పశ్చిమ గోదావరి 39

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu