ఏపీలో కరోనా విజృంభణ: కొత్తగా 23 కేసులు, 14కు చేరిన మృతులు

Published : Apr 15, 2020, 08:45 PM ISTUpdated : Apr 15, 2020, 08:49 PM IST
ఏపీలో కరోనా విజృంభణ: కొత్తగా 23 కేసులు, 14కు చేరిన మృతులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 525కు చేరుకుంది. మృతుల సంఖ్య 14కు చేరుకుంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 23 కేసులు పెరిగాయి. రాష్ట్రంలో బుధవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు కొత్తగా ఆ కేసులు నమోదయ్యాయి. కొత్తగా కర్నూలు జిల్లాలో 13, గుంటూరు జిల్లాలో 4, కడప జిల్లాలో 3, నెల్లూరులో 2, అనంతపురంలో ఒక కేసులు నమోదయ్యాయి. 

ఇప్పటి వరకు 20 మంది డిశ్చార్జీ అయ్యారు. 14 మంది మరణించారు. దీంతో ప్రస్తుతం ఆస్పత్రుల్లో 491 మంది చికిత్స పొందుతున్నారు. గుంటూరు జిల్లా 122 కేసులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కర్నూలులో 110 కేసులు నమోదయ్యాయి. దీంతో అత్యధిక కేసుల నమోదైన జిల్లాల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కరోనా కేసులు ఏవీ నమోదు కాలేదు. 

జిల్లాలవారీగా కరోనా వైరస్ కేసుల సంఖ్య ఇలా ఉంది...

అనంతపురం 21
చిత్తూరు 23
తూర్పు గోదావరి 17
గుంటూరు 122
కడప 36
కృష్ణా 45
కర్నూలు 110
నెల్లూరు 58
ప్రకాశం 42
విశాఖపట్నం 20
 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం