సగం ఇంజక్షన్ చేసి వదిలేశారు: జీజీహెచ్ ఆసుపత్రిలో కరోనా బాధితురాలి సెల్పీ వీడియో

By narsimha lodeFirst Published Jul 30, 2020, 5:45 PM IST
Highlights

కరోనాతో చేరిన తనను, రెండు నెలల చిన్నారిని పట్టించుకోవడం లేదని జీజీహెచ్ ఆసుపత్రి సిబ్బందిపై  ఓ బాలింత ఆరోపణలు చేసింది. ఇంజక్షన్ లోడ్ చేసి కూడ ఇంజక్షన్ ఇవ్వలేదని ఆ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె సెల్ఫీ వీడియోలో తన బాధను ఆవేదనను వ్యక్తం చేసింది.

గుంటూరు: కరోనాతో చేరిన తనను, రెండు నెలల చిన్నారిని పట్టించుకోవడం లేదని జీజీహెచ్ ఆసుపత్రి సిబ్బందిపై  ఓ బాలింత ఆరోపణలు చేసింది. ఇంజక్షన్ లోడ్ చేసి కూడ ఇంజక్షన్ ఇవ్వలేదని ఆ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె సెల్ఫీ వీడియోలో తన బాధను ఆవేదనను వ్యక్తం చేసింది.

గుంటూరు జిల్లాకు చెందిన కిరణ్ గీత అనే బాధితురాలు సెల్పీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయమై మీడియాలో ఈ వీడియోలు ప్రసారమయ్యాయి. 

రెండు నెలల కొడుకుకు, తనకు కరోనా సోకిందని  ఆమె చెప్పారు.కనీసం తమను పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 24వ తేదీన తాను జీజీహెచ్ ఆసుపత్రిలో చేరినట్టుగా ఆమె చెప్పారు. రెండు నెలల చిన్నారికి అనారోగ్యంగా ఉన్నా కూడ వైద్యులు పట్టించుకోవడం లేదని ఆమె చెప్పారు.

ఒక్క ఇంజక్షన్ వేయడం కోసం మూడు రోజులుగా తనను ఇబ్బందులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు. రూ. 1800 విలువ చేసే ఇంజక్షన్ ను బయటి నుండి తెప్పించుకొన్నా కూడ ఆ ఇంజక్షన్ వేయలేదన్నారు.

ఇంజక్షన్ చేసేందుకు లోడ్ చేసి చేయకుండావదిలివెళ్లారని ఆమె ఆ వీడియోలో చూపించారు. దీంతో మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు ప్రసారం కావడంతో జీజీహెచ్ సూపరింటెండ్ సుధాకర్ స్పందించారు.

కిరణ్ గీత చేసిన ఆరోపణలపై స్పందించారు. ఈ విషయం తనకు మీడియా ప్రతినిధుల ద్వారా ఇప్పుడే తెలిసిందన్నారు. ఇంజక్షన్లు చేయకుండా ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించారో గుర్తించి చర్యలు తీసుకొంటామన్నారు. బయటి నుండి ఇంజక్షన్లు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు.

click me!