కర్నూల్‌లో ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సత్యనారాయణ: పోలీసుల దర్యాప్తు

By narsimha lode  |  First Published Sep 8, 2023, 10:59 AM IST

కర్నూల్ లో లోకాయుక్తలో పనిచేస్తున్న కానిస్టేబుల్  సత్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు. 


కర్నూల్: నగరంలోని  లోకాయుక్త భవనంలో పనిచేస్తున్న  కానిస్టేబుల్  సత్యనారాయణ  శుక్రవారంనాడు ఆత్మహత్యకు పాల్పడ్డారు.సత్యనారాయణకు  భార్య, కుమార్తె, కొడుకు ఉన్నారు.విధి నిర్వహణలో  ఉన్న సమయంలోనే  సత్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు. సత్యనారాయణ ఆత్మహత్యపై  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  సత్యనారాయణ  కూతురు  హైద్రాబాద్ లో విధులు నిర్వహిస్తున్నారు.గతంలో  కూడ  విధుల్లో ఉన్న  కానిస్టేబుళ్లు  ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

దేశ వ్యాప్తంగా  ఈ తరహ ఘటనలు పలు నమోదయ్యాయి.  రంగారెడ్డి  జిల్లాలోని  యాచారంలో  గడ్డమల్లాయిగూడ గ్రామానికి చెందిన  వినోద్ అనే కానిస్టేబుల్   ఆత్మహత్య చేసుకున్నారు.ఈ ఏడాది జూన్ 10వ తేదీన  ఆత్మహత్య చేసుకున్నాడు. వినోద్  అనారోగ్య సమస్యలతో  ఆత్మహత్య చేసుకున్నాడని  చెబుతున్నారు. ఈ ఘటనపై  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Videos

undefined

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కానిస్టేబుల్  ఆత్మహత్య చేసుకున్న ఘటన ఈ ఏడాది మే 14న  జరిగింది.వివేక్ వర్మ అనే కానిస్టేబుల్  ఆత్మహత్య చేసుకున్నాడు.  వివేక్ వర్మ  మృతదేహం వద్ద  సూసైడ్ నోట్ ను  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఏడాది మే  5న తెలంగాణలోని వరంగల్ లో  ఓ మహిళా కానిస్టేబుల్  ఆత్మహత్య చేసుకుంది.  మహిళా కానిస్టేబుల్ మృతిపై  కుటుంబ సభ్యులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు.2022  మే 16న   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో  ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో  ఆయన  ఆత్మహత్య చేసుకున్నాడు.హైద్రాబాద్ నగరంలోని నాచారంలో పోలీస్ కానిస్టేబుల్ గత ఏడాది  20వ తేదీన  ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగం చెరువు తండాలో  ఆయన నివాసం ఉంటున్నారు.  మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఆయన విధులు నిర్వహిస్తున్నాడు. వ్యక్తిగత కారణాలతో  ఆయన  ఆత్మహత్య చేసుకున్నాడని  ఆరోపిస్తున్నారు.

ఆత్మహత్యలు పరిష్కారం కావు

జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.

 

click me!