రంగంలోకి కోస్ట్‌గార్డ్, హెలికాప్టర్: ఏడుగురు మత్య్సకారుల ఆచూకీ కోసం గాలింపు

By narsimha lodeFirst Published Aug 16, 2018, 1:36 PM IST
Highlights

కాకినాడ తీరంలో మత్సకారులు గల్లంతయ్యారు. గల్లంతైన  మత్స్యకారుల కోసం కోస్ట్‌గార్డులు, హెలీకాప్టర్‌తో గాలింపు చర్యలు చేపట్టినట్టు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ ప్రకటించారు.
 

కాకినాడ: కాకినాడ తీరంలో మత్సకారులు గల్లంతయ్యారు. గల్లంతైన  మత్స్యకారుల కోసం కోస్ట్‌గార్డులు, హెలీకాప్టర్‌తో గాలింపు చర్యలు చేపట్టినట్టు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ ప్రకటించారు.

కాకినాడ ఫిషింగ్ బోట్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  ఈ నెల 7వ తేదిన  మత్య్స కారులు సముద్రంలో వేటకు వెళ్లారు. నాలుగు రోజుల్లో తిరిగి రావాల్సి ఉంది. ఈ నెల 11 వ తేదీ వరకు మత్స్యకారులు తిరిగి రావాల్సి ఉంది. ఏడుగురు మత్య్సకారుల ఆచూకీ లభ్యం కాలేదు. ఈ విషయమై బాధిత కుటుంబసభ్యులు  జిల్లా కలెక్టర్ కు సమాచారాన్ని ఇచ్చారు.

బుధవారం సాయంత్రం బోటు మిస్సింగ్ పై  బాధిత కుటుంబసభ్యులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కోస్ట్ గార్డు సిబ్బంది గాలింపు చర్యలను ప్రారంభించారు. కోస్ట్ గార్డుతో పాటు హెలికాప్టర్ కూడ రంగంలోకి దించాలని కలెక్టర్ భావించారు.

ఏడుగురు మత్య్సకారుల కోసం సముద్రంలో గురువారం నాడు కోస్ట్ గార్డ్స్ గాలింపు చేపట్టారు. బాధిత కుటుంబసభ్యులు  మత్స్యకారుల కోసం ఎదురుచూస్తున్నారు.
 

click me!