సీఎం కాన్వాయ్ కోసం బలవంతంగా ఒంగోలులో వాహనం తీసుకెళ్లిన కానిస్టేబుల్: విచారణకు జగన్ఆదేశం

Published : Apr 21, 2022, 09:30 AM ISTUpdated : Apr 21, 2022, 11:58 AM IST
సీఎం కాన్వాయ్ కోసం బలవంతంగా  ఒంగోలులో వాహనం తీసుకెళ్లిన కానిస్టేబుల్: విచారణకు జగన్ఆదేశం

సారాంశం

తిరుపతికి వెళ్తున్న ఓ కుటుంబానికి చెందిన వాహనాన్ని సీఎం కాన్వాయ్ కోసం తీసుకెళ్లారనే మీడియా కథనాలపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఒంగోలు:  తిరుపతికి వెళ్తున్న ఓ కుటుంబం  వాహనాన్ని రవాణా శాఖ అధికారులు తీసుకెళ్లిన ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు.ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 22వ తేదీన సీఎం జగన్  ఒంగోలులో పర్యటించనున్నారు. సీఎం ఒంగోలు పర్యటనకు CM Convoy వాహనాల కోసం ప్రైవేట్ వాహనాలపై రవాణా శాఖాధికారులు కన్నేశారు.   Tirupatiకి ఓ కుటుంబం ఇన్నోవా వాహనంలో వెళ్తుంది. బుధవారం నాడు రాత్రి ఒంగోలులోని ఓ హోటల్ వద్ద Tiffin చేస్తున్న సమయంలో ఓ Constable అక్కడికి వచ్చి ఈ వాహనాన్ని ఇవ్వాలని కోరాడు.

తాము తిరుపతికి వెళ్తున్నామని ఈ సమయంలో వాహనం ఇవ్వలేమని కానిస్టేబుల్ కు ఆ కుటుంబం తేల్చి చెప్పింది. సీఎం YS Jaganపర్యటన సందర్భంగా కాన్వాయ్ ఏర్పాటుకు సంబంధించి వాహనాల కోసం మీ వాహనం ఇవ్వాల్సిందేనని కానిస్టేబుల్ తేల్చి చెప్పాడు. మీకు వాహనం ఇస్తే తాము తిరుపతికి ఎలా వెళ్లాలని ఆ కుటుంబం ప్రశ్నించింది. మీకు సారీ చెప్పడం మినహా తాను ఏమీ చేయలేనని వాహనంతో పాటు డ్రైవర్ ను కానిస్టేబుల్ తీసుకెళ్లాడు.దీంతో Ongole రోడ్డుపైనే రాత్రంతా తాము ఇబ్బందులు పడ్డామని ఆ కుటుంబం తెలిపింది.ఈ విషయమై మీడియాలో కథనాలు వచ్చాయి.ఈ కథనాలపై సీఎం జగన్ సీరియస్ గా తీసుకొన్నారు.   కాన్వాయ్ కోసం ఓ కుటుంబం తిరుపతికి తీసుకెళ్తున్న వాహనం తీసుకెళ్లిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ ఘటనపై విచారణ జరిపి  బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం గురువారం నాడు ఆదేశించారు.

అసలు ఏం జరిగిందంటే?

పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన  మేమల శ్రీనివాస్ కుటుంబం తిరుమలకు బయలుదేరింది.  ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు పిల్లలు ఇన్నోవా కారులో తిరుపతికి బయలు దేరారు.  ఒంగోలు పట్టణంలోని బుధవారం నాడు రాత్రి చేరుకున్నారు.  పాత మార్కెట్ సెంటర్ లోని హోట్ వద్ద శ్రీనివాస్ కుటుంబం టిఫిన్ చేస్తున్న సమయంలో  ఓ కానిస్టేబుల్ అక్కడికి వచ్చి వాహనం అడిగాడు.

ఈ నెల 22న సీఎం ఒంగోలు టూర్ ఉంది. సీఎం కాన్వాయ్ కోసం వాహనం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి తీసుకెళ్లాడు. వాహనంతో పాటు డ్రైవర్ ను కూడా తీసుకెళ్లాడు. ఉన్నతాధికారుల ఆదేశాలతో తాము ఇలా చేయాల్సి వచ్చిందని కానిస్టేబుల్ వారికి సారీ చెప్పి వాహనం తీసుకొని వెళ్లిపోయాడు. వాహనం లేకపోవడంతో ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ లోనే వారంతా రాత్రంతా ఉండిపోయారు.ఈ విషయమై పోలీసుల వద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. అయితే తమ దృష్టికి ఈ విషయం రాలేదని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!