టీడీపీలో చేరితే తప్పేంటీ: రాజకీయాల్లోకి హీరో శివాజీ

Published : Jan 04, 2019, 06:25 PM IST
టీడీపీలో చేరితే తప్పేంటీ: రాజకీయాల్లోకి హీరో శివాజీ

సారాంశం

టీడీపీలో చేరితే తప్పేముందని సినీ నటుడు శివాజీ ప్రశ్నించారు. తనకు టీడీపీలో చేరే హక్కుందన్నారు. ఏపీలో విపక్ష పార్టీపై శివాజీ విమర్శలు గుప్పించారు.  


అమరావతి: టీడీపీలో చేరితే తప్పేముందని సినీ నటుడు శివాజీ ప్రశ్నించారు. తనకు టీడీపీలో చేరే హక్కుందన్నారు. ఏపీలో విపక్ష పార్టీపై శివాజీ విమర్శలు గుప్పించారు.

శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో రాబోతున్నట్టు శివాజీ ప్రకటించారు. రాజకీయ రంగ ప్రవేశం గురించి తన అభిప్రాయాన్ని ప్రకటించారు. రాజకీయాల్లో వస్తానని తేల్చి చెప్పారు. 

ఏపీలో విపక్ష పార్టీ వైసీపీ తన పాత్రను సక్రమంగా నిర్వహించడం లేదని  శివాజీ ఆరోపించారు. వైసీపీపై విమర్శలు చేస్తున్న సమయంలో  టీడీపీలో చేరుతారని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే తనకు టీడీపీలో చేరే హక్కు లేదా అంటూ ఆయన  ప్రశ్నించారు.టీడీపీలో చేరితే తప్పుబట్టాల్సిన అవసరం లేదన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై కుట్రలు జరుగుతున్నాయని శివాజీ మరోసారి ఆరోపణలు చేశారు. తాను ప్రజల కోసం  పోరాటం చేస్తున్నానని ఆయన చెప్పారు. టీడీపీ కోసం తాను పనిచేయడం లేదని మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు  సమాధానంగా చెప్పారు. తనకు అసెంబ్లీలో అధ్యక్షా అంటూ సంభోదించే హక్కు లేదా అని ఆయన ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

బాబు, పవన్ పొత్తు: శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు

PREV
click me!

Recommended Stories

AP Power Sector : ఏపీకి కొత్త పవర్ ప్లాన్.. తీరనున్న కరెంట్ కష్టాలు..భవిష్యత్ కోసం బ్యాటరీ స్టోరేజ్
IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్