
తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ దోస్తులన్న విషయం ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయిందని మంత్రి చినరాజప్ప అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంతో జగన్ కుమ్మక్కై ఏపీ అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శించారు.
జగన్‌ను కేసీఆర్ హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నారని అన్నారు. వైసీపీ అభ్యర్థులను టీఆర్‌ఎస్ కార్యాలయం నుంచే ఎంపిక చేశారని చినరాజప్ప ఆరోపించారు. ఏపీ పోలీసులను జగన్ నమ్మరని.. అలాగే జగన్‌ను ఏపీ ప్రజలు నమ్మరని అన్నారు. ఎన్నికల తర్వాత జగన్ టీఆర్‌ఎస్ మంత్రివర్గంలో చేరతారని చినరాజప్ప ఎద్దేవా చేశారు.