జేసీకి షాకిచ్చిన చంద్రబాబు.. టికెట్ లేనట్టేనా..?

By ramya neerukondaFirst Published Dec 1, 2018, 12:37 PM IST
Highlights

 గత ఎన్నికల్లో అనంతపురంలో 14 అసెంబ్లీ స్థానాలకు 12 స్థానాలు టీడీపీ గెలవడానికి కారణం కూడా తన వల్లనే అని జేసీ ఫీలౌతుంటారు.
 

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిమ్మతిరిగే షాకిచ్చారు. జేసీ దివాకర్ రెడ్డికి సొంత జిల్లా అనంతపురంలోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. గత ఎన్నికల్లో అనంతపురంలో 14 అసెంబ్లీ స్థానాలకు 12 స్థానాలు టీడీపీ గెలవడానికి కారణం కూడా తన వల్లనే అని జేసీ ఫీలౌతుంటారు.

అలాంటి జేసీకి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వనని చంద్రబాబు చెప్పారంటూ.. అనంతపురంలో ప్రచారం ఊపందుకుంది. చంద్రబాబు సమాధానంతో జేసీకి మైండ్ బ్లాక్ అయ్యిందని సమాచారం.

ఇంతకీ మ్యాటరేంటంటే...ఇటీవల రెండు రోజుల పర్యటన కోసం సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లాకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో  జిల్లాలో టీడీపీ పరిస్థితితో పాటు స్థానిక అధికారుల పనితీరును ఆయన సమీక్షించారు. అనంతపురంలోని ఆర్‌ అండ్‌ బీ అతిథిగృహ ప్రాంగణంలో తనకోసం కేటాయించిన బస్సులోనే ఆయన ఒక రాత్రి బసచేశారు. 

ఆ సమయంలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఏకాంతంగా చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని కొన్ని స్థానాల్లో సిట్టింగ్‌లను మార్చాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారట. ఈ కసరత్తులో భాగంగానే తాను ఎమ్మెల్యేల పనితీరుపై వివిధ మార్గాల్లో సర్వేలు నిర్వహిస్తున్నాననీ, అందులో మంచి ఫలితాలు ఉన్నవారికే టిక్కెట్లు కేటాయిస్తాననీ స్పష్టంచేశారట. 

ఈ తరుణంలో జేసీ దివాకర్‌రెడ్డి కల్పించుకుని "నా మీద సర్వే నిర్వహించినప్పుడు వ్యతిరేకంగా ఫలితాలు వస్తే టిక్కెట్ ఇవ్వరా?'' అని ప్రశ్నించారట దీనిపై స్పందించిన చంద్రబాబు "టిక్కెట్‌ ఇవ్వను'' అని నిర్మొహమాటంగా చెప్పేశారట. బాబు ఇచ్చిన జవాబుతో జేసీ దివాకర్‌రెడ్డి షాక్‌కు గురయ్యారట. ఈ విషయం టీడీపీ నేతల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

click me!