
డోన్ నియోజకవర్గంలో జరిగిన సభలో టిటిడి లడ్డూ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎలాంటి చర్యలను తాను చేయనని, అలాంటి పనులు జరగనివ్వనని ఆయన అన్నారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.