ఏపీలో ఇంకా దాడులు జరుగుతాయ్: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

By Nagaraju TFirst Published Oct 30, 2018, 5:33 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ దాడులు మరింతగా జరిగే అవకాశం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న చంద్రబాబు నాయడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత తమపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 

కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ దాడులు మరింతగా జరిగే అవకాశం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న చంద్రబాబు నాయడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత తమపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 

ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన వెంటనే 19 బృందాలతో ఏపీలో ఐటీ దాడులు చేయించి కలకలం సృష్టించారని చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ నేతలపై వరుస దాడులకు పాల్పడుతూ తమపై వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 

గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడిన మాజీ కేంద్రమంత్రి సుజనాచౌదరిపై ఈడీ దాడులు నిర్వహించిందని అలాగే ఐటీ రైడ్స్ పై ప్రశ్నించినందుకు ఎంపీ సీఎం రమేష్ నివాసాలపైనా కంపెనీలపైనా దాడులు చేశారని చెప్పుకొచ్చారు. ఇంకా దాడులు జరుగుతాయని అవసరమైతే తనపైనా దాడులు జరుగుతాయని చెప్పుకొచ్చారు. 

టీడీపీ నాయకులే టార్గెట్ గా ఐటీ దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఎన్ని దాడులు జరిగినా తాము భయపడేది లేదని ఆంధ్రప్రదేశ్ కోసం పోరాటం చేస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఐటీ ఈడీ దాడులతో తమను భయపెట్టాలని చూస్తే భయపడిపోయే వాళ్లం కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు చంద్రబాబు నాయుడు. 

మరోవైపు వైసీపీ అధినేత జగన్ పై దాడిని కోడి కత్తి డ్రామా అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. దాడి జరిగింది విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో కేంద్రం ఆధీనంలో ఉన్న ప్రాంతంలో జరిగితే అందుకు ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం ఏమోచ్చిందని వైసీపీని ప్రశ్నించారు చంద్రబాబు. సీఐఎస్ఎఫ్ ఆధీనంలో విశాఖ ఎయిర్ పోర్ట్ ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటూ వ్యాఖ్యానించడం సబబుకాదన్నారు. 

జగన్ పై దాడి రోజన విశాఖపట్నంలో ఫింటెక్ సదస్సు జరిగిందని అదే రోజు క్రికెటర్లు విశాఖపట్నంలోనే ఉన్నారని రాష్ట్ర ఖ్యాతి ఎక్కడ దెబ్బతింటుందోనని ఆవేదన చెందానన్నారు. కలెక్టర్ల సమావేశంలో ఉండగా ఘటనపై ఆరా తీశానని చెప్పారు. జగన్ తో మాట్లాడాలని ప్రయత్నిస్తే తానే ఏ వన్ ముద్దాయి అంటూ వైసీపీ ఆరోపించిందని చంద్రబాబు తెలిపారు.  

40 ఏళ్ల రాజకీయ జీవితంలో శాంతిభద్రతలపై పోరాడానే తప్ప హత్యా రాజకీయాలకు ఎప్పుడూ పాల్పడలేదని స్పష్టం చేశారు.నా ప్రాణం పోయినా పర్వాలేదు ప్రజలు ప్రశాంతంగా ఉండాలనే ఉద్యమాలు చేశానని గుర్తు చేశారు. మతసామరస్యంపై పోరాడానని రౌడీయిజంపై పోరాడానని గుర్తు చేశారు. రాజకీయ పోరాటం తప్ప కక్ష అనేది తన రాజకీయ జీవితంలో ఏమీ లేదన్నారు చంద్రబాబు. 

ఆపరేషన్ గరుడ అంటూ సినీనటుడు శివాజీ చెప్తున్నవన్నీ వాస్తవమేననిపిస్తోందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేసేందుకు కేంద్రం ఏదో ఒక రూట్ లో ఆంధ్రప్రదేశ్ లో వచ్చేందుకు ప్రయత్నిస్తుందని మార్చిలోనే శివాజీ చెప్పారని చెప్పారు. ప్రస్తుతం జరగుతున్న పరిస్థితులు చూస్తే వాస్తవమనిపిస్తోందన్నారు. 

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడతానని తప్పుడు రాజకీయాలు చేసి తమను ఇబ్బంది పెట్టాలని చూస్తే తెలుగు జాతి పౌరుషం చూపిస్తామని కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు. దాడి జరిగిన తర్వాత విశాఖ నుంచి హైదరాబాద్ కు బాగానే వెళ్లిన జగన్ అక్కడ డ్రామా మెుదలుపెట్టారని ఆరోపించారు. 

తాను ఎవరిని వదిలిపెట్టనన్న ఆయన ధర్మంకోసం పోరాడుతానని కోడికత్తి డ్రామాలో వాస్తవాలను బయటకు తీస్తానని తెలిపారు. దాడి ఘటనకు సంబంధించి వాంగ్మూలం ఇవ్వమని అడిగితే ఏపీ పోలీసులపై నమ్మకం లేదని జగన్ అనడాన్ని తప్పుబట్టారు చంద్రబాబు. ప్రభుత్వాలు మారతాయి కానీ పోలీస్ వ్యవస్థ మాత్రం మారదన్న విషయాన్ని జగన్ గుర్తెరగాలని సూచించారు. 
 

click me!