నంద్యాలలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ .. విజయవాడకు తరలింపు...(వీడియో)

Published : Sep 09, 2023, 06:22 AM ISTUpdated : Sep 09, 2023, 09:16 AM IST
నంద్యాలలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ .. విజయవాడకు తరలింపు...(వీడియో)

సారాంశం

చంద్రబాబునాయుడును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టుకు సంబంధించిన పేపర్లను సీఐడీ  పోలీసులు చంద్రబాబుకు, లాయర్లకు ఇచ్చారు. 

నంద్యాల : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం అర్థరాత్రి నంద్యాలలో ఆయనను అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువెడుతున్నారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబున సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిమీద చంద్రబాబు నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు.

స్కిల్ స్కామ్ కేసులో నన్నెలా అరెస్ట్ చేస్తారు అని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ చేయలేదు,నోటీసులు ఇవ్వలేదు.. ఏదో జరిగిందని కేసు పెడుతున్నారు అని తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన అధికారులతో ఆయన అన్నారు. 

మీకూ, నాకు  రాజ్యాంగమే ఆధారం..ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు...ఆధారాలు ఉంటే ఉరి తీయండి..స్కిల్ స్కామ్ కేసులో నా పేరు ఎందుకు ఉంది...అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 

రిమాండ్ రిపోర్ట్ ఇవ్వమని అడిగారు. కానీ ముందే రిమాండ్ రిపోర్ట్ ఇవ్వడం కుదరదని అధికారులు తెలిపారు. విజయవాడ వెళ్లే లోపు రిమాండ్ రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. రిమాండ్ రిపోర్టులో అన్ని విషయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు పాత్ర ఉందని హైకోర్టుకు చెప్పామని వారు తెలిపారు. 

దర్యాప్తు అధికారి రాకుండా ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఎలా అరెస్ట్ చేస్తారని చంద్రబాబు లాయర్లు ప్రశ్నించారు. అరెస్టుకు సంబంధించిన పేపర్లను సీఐడీ పోలీసులు చంద్రబాబుకు, లాయర్లకు ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్