
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు పన్ను ఎగవేత చిక్కులను ఎదుర్కుంటున్నారు. హైదరాబాదులోని ఆయన కార్పోరేట్ కార్యాలయాలపై సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (సిజిఎస్టీ) అధికారులు దాడులు చేశారు.
పెద్ద యెత్తున పన్ను ఎగవేశారనే ఆరోపణలతో వారు ఈ దాడులు నిర్వహించారు. బిజెపితో తెలుగుదేశం పార్టీ తెగదెంపులు చేసుకున్న తర్వాత ఈ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.
రాయపాటి సాంబశివరావుకు చెందిన ఇంజనీరింగ్, కన్సట్రక్షన్ కంపెనీ ట్రాన్సిటరీ (ఇండియా) లిమిటెడ్ 2012లో కోట్లాది రూపాయలకు చెందిన పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును దక్కించుకుంది. హైదరాబాదులోని బేగంపేట, కమలాపురి కాలనీల్లో ఆ సంస్థ కార్యాలయాలున్నాయి.