
పీకల్లోతు అప్పులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం శుభవార్త చెప్పింది. రెవెన్యూ లోటు భర్తీ కింద రాష్ట్రానికి మంగళవారం రూ.879 కోట్లను విడుదల చేసింది. వీటితో కలిపి ఈ ఏడాదికి ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ లోటు కింద రూ.7,032 కోట్లను కేంద్రం విడుదల చేసినట్లయ్యింది. ఈ రోజు ఏపీ సహా మొత్తం 14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసింది కేంద్రం. వీటిలో అసోం, మణిపూర్, కేరళ, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌లు వున్నాయి. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌కు రూ.1,132 కోట్లను కేంద్రం విడుదల చేసింది.