ఐఏఎస్ శ్రీలక్ష్మికి కోర్టు ఝలక్.. ఖర్చులకు డబ్బులు కట్టమంటూ ఆదేశాలు..

By AN TeluguFirst Published Jun 30, 2021, 9:12 AM IST
Highlights

ఓబులాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్ పై వాయిదా.. కోరినందుకు ఖర్చుల కింద రూ. వెయ్యి చెల్లించాలంటూ నిందితురాలైన ఏపీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని సీబీఐ కోర్టు ఆదేశించింది. 

ఓబులాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్ పై వాయిదా.. కోరినందుకు ఖర్చుల కింద రూ. వెయ్యి చెల్లించాలంటూ నిందితురాలైన ఏపీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని సీబీఐ కోర్టు ఆదేశించింది. 

నగదును మెట్రోపాలిటన్ లీటల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని మంగళవారం ఆదేశించింది. ఈ కేసును కొట్టివేయాలంటూ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, డిశ్చార్జి పిటిషన్ ను వాయిదా వేయాలని ఆమె కోరారు. 

హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వుల్లేవని, వాదనలు వినిపించాలని గతంలో ఆదేశించామని కోర్టు పేర్కొంది. చివరగా మరో అవకాశం ఇస్తున్నామని, ఖర్చుల కింద వెయ్యి చెల్లించాలని ఆదేశిస్తూ విచారణను జూలై 5 కి వాయిదా వేసింది. 

పెన్నా కేసు 6కి వాయిదా : జగన్ అక్రమాస్తుల వ్యవకహారంలో పెన్నా కేసు విచారణను జూలై 6కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీడీ రాజగోపాల్ దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్ లో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. 

click me!