షాక్: కర్నూల్‌లో టీడీపీ చీఫ్‌ చంద్రబాబుపై క్రిమినల్ కేసు

Published : May 07, 2021, 04:51 PM ISTUpdated : May 07, 2021, 05:02 PM IST
షాక్: కర్నూల్‌లో టీడీపీ చీఫ్‌ చంద్రబాబుపై క్రిమినల్ కేసు

సారాంశం

: కర్నూల్ లో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడిపై శుక్రవారంనాడు కేసు నమోదైంది. 

:కర్నూల్: కర్నూల్ లో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడిపై శుక్రవారంనాడు కేసు నమోదైంది. సుబ్బయ్య అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. కర్నూల్‌లో ఎన్-440 కే వైరస్ ఉందంటూ చంద్రబాబునాయుడు వ్యాఖ్యలతో సామాన్య ప్రజలు భయాందోళనలు చెందుతున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై చంద్రబాబుపై  ఐపీసీ 155, 505 (1) (బి)(2) సెక్ష కింద కేసు నమోదు చేశారు. ఏపీ రాష్ట్రంలో కొత్త రకం కరోనా వేరియంట్  వెలుగు చూసిందని  రెండు రోజుల క్రితం చంద్రబాబునాయుడు మీడియా సమావేశంలో ప్రకటించారు.

 

అయితే రాష్ట్రంలో ఎలాంటి కొత్త కరోనా వేరియంట్ ‌ను గుర్తించలేదని  ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. చంద్రబాబునాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శించారు. ఈ విషయమై  ఏపీ వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ముఖ్య అధికారులు వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి వచ్చినవారికి 14 రోజుల పాటు  క్వారంటైన్ లో ఉండాలని ఢిల్లీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ పరిస్థితి రావడానికి చంద్రబాబు చేసిన తప్పుడు ప్రచారం కూడ కారణమని ఏపీ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. 


 

PREV
click me!

Recommended Stories

తిరుమల వైకుంఠ ద్వార దర్శనంచేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu
Tirumala Vaikunta Ekadashi: వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుమలలో స్వర్ణరథం | Asianet News Telugu