లాక్ డౌన్ ఉల్లంఘన: పలాస ఎమ్మెల్యే అప్పలరాజుపై కేసు

By telugu teamFirst Published May 14, 2020, 9:57 AM IST
Highlights

లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడిన శ్రీకాకుళం జిల్లా పలాస శాసనసభ్యుడు అప్పలరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన అనుచరులతో కలిసి బుధవారం చెక్ పోస్టు వద్ద సందడి చేసిన విషయం తెలిసిందే.

శ్రీకాకుళం:  లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడిన శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే అప్పలరాజుపై కేసు నమోదైంది. ఆయనతో పాటు మరో 9 మందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. 

శ్రీకాకుళం జిల్లా పలాస శాసనసభ్యుడు అప్పలరాజు లాక్ డౌన్ ను ఉల్లంఘించిన విషయం తెలిసిందే. ఒడిశా నుంచి బస్సులో తన అనుచరులను తీసుకుని వచ్చారు. వారిని లోనికి అనుమతించాలని పట్టుపురం చెక్ పోస్టు వద్ద పోలీసులు వాదనకు దిగారు. బారికేడ్లను తొలగించి బస్సును లోనికి నడిపించారు. 

ఆ సంఘటనపై పోలీసులు జిల్లా కలెక్టర్ కు, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల అనుమతి లేదని చెప్పినా అప్పలరాజు వినలేదు. బస్సుతో పాటు తన అనుచరులతో గంట పాటు అప్పల రాజు రోడ్డు మీదే ఉన్నారు. చివరకు బారికేడ్లను తొలగించి లోనికి వచ్చారు. 

అప్పలరాజు అనుచరులు మార్చి 17వ తేదీన ఓ వివాహంలో పాల్గొనడానికి ఒడిశా వెళ్లారు. 26 మందిని ఎమ్మెల్యే బస్సులో తీసుకుని వచ్చారు. చివరకు అప్పలరాజు అనుచరులను శ్రీకాకుళం జిల్లాలోని క్వారంటైన్ కు తరలించారు. 

చాలా కాలం శ్రీకాకుళం జిల్లాలో చాలా జీరో కేసులు నమోదవుతూ వచ్చాయి. చివరకు జిల్లాలో కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. 

click me!