వంతెన మీది నుంచి కిందపడ్డ కారు.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

Published : Mar 22, 2022, 11:25 AM IST
వంతెన మీది నుంచి కిందపడ్డ కారు.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

సారాంశం

నెల్లూరులో ఓ కారు ప్రమాదం జరిగింది. వంతెన మీదినుంచి కారు కిందపడింది. ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురిలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని ఆతస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 


నెల్లూరు :  Nellore  జిల్లాలో road accident జరిగింది. వరికుంటపాడు వద్ద పైవంతెన నుంచి car కిందపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వరికుంటపాటు కోల్డ్ స్టోరేజ్ వద్ద వంతెన పై నుంచి కింద పడిన కారులో డ్రైవర్ సహా ముగ్గురు ఉన్నారు. 

ప్రమాదంలో పామూరుకు చెందిన వెంకటలక్ష్మమ్మ కారులోనే మృతిచెందారు. డ్రైవర్ తో పాటు మరో యువతికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉదయగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఘటన మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, Nellore వెంకటగిరిలో సోమవారం ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. Inter student చిగురుపాటి Jyothikaను ప్రేమించలేదనే కోపంతో చెంచుకృష్ణ అనే యువకుడు కత్తితో గొంతు కోశాడు. జ్యోతిక పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెంచుకృష్ణను అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

చెంచుకృష్ణ కొంతకాలంగా ప్రేమించాలంటూ యువతి వెంటపడుతున్నాడు. దీనికి ఆ యువతి అంగీకరించకపోవడంతో నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని ఆ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.  ప్రేమించలేదని యువతి గొంతు Choked చేశాడు. వివరాల్లోకి వెడితే.. పట్టణంలోని కాలేజీమిట్టకు చెందిన చిగురుపాటి జ్యోతిని (17) గత కొంత కాలంగా ప్రేమించాలంటూ చెంచు కృష్ణ అనే యువకుడు వేధిస్తున్నాడు. 

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు యువకుడిని మందలించారు. దీంతో కోపం పెంచుకున్న యువకుడు ఇంట్లో నిద్రిస్తున్న జ్యోతిని చూసి నేరుగా ఇంటిలోకి జోరబడి చాకుతో గొంతు కోశాడు. గొంతు కోసి ఆ తరువాత నింపాదిగా వెళ్లి కల్లు తాగి ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. కాసేపటికి విషయం తెలుసుకున్న స్థానికులు తలుపులు పగులకొట్టి చెంచుకృష్ణను పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం చెంచు కృష్ణ పోలీసులు అదుపులో ఉన్నాడు. యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

PREV
click me!

Recommended Stories

Seediri Appalaraju Pressmeet: కూటమిపై మండిపడ్డసీదిరి అప్పలరాజు | Asianet News Telugu
ఆర్ట్స్ కాలేజ్ లైబ్రరీ, నన్నయ్య యూనివర్సిటీని సందర్శించిన Minister Nara Lokesh Asianet News Telugu