కొడాలి నానిని బొక్కలో వేయడం గ్యారెంటీ.. జగన్ నుంచి వారికి ప్రాణహాని: బుద్దా వెంకన్న సంచలనం

Published : Jun 17, 2023, 02:21 PM IST
కొడాలి నానిని బొక్కలో వేయడం గ్యారెంటీ.. జగన్ నుంచి వారికి ప్రాణహాని: బుద్దా వెంకన్న సంచలనం

సారాంశం

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొడాలి నాని చెప్పేవన్నీ అబద్దాలేనని  విమర్శించారు. కొడాలి నాని బ్రతుకే లాలూచీ బ్రతుకని విమర్శించారు.

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొడాలి నాని చెప్పేవన్నీ అబద్దాలేనని  విమర్శించారు. కొడాలి నాని బ్రతుకే లాలూచీ బ్రతుకని విమర్శించారు. నోటికొచ్చిన అబద్దాలు చెప్పే కొడలినాని అన్నం తింటున్నాడా గుట్కాలు తింటున్నాడా? అంటూ ప్రశ్నించారు. గుడివాడలో కొడాని నాని చేసిన భూ కుంభకోణంపై తెలుగుదేశం ప్రభుత్వం  వచ్చాక సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని అన్నారు.  కొడాలి నానిని బొక్కలో వేయడం గ్యారెంటీ అని చెప్పుకొచ్చారు. మరో ఆరు నెలల్లో కొడాలి నానికి దబిడి.. దిబిడే అంటూ హెచ్చరించారు.

గుడివాడ ప్రజలు కొడాలినానికి ఎప్పుడో గోరీ కట్టారని.. అయితే ఒళ్లు కొవ్వెక్కి దిగిన బుల్లెట్ తెలియట్లేదంతే అంటూ బుద్దా వెంకన్న సెటైర్లు వేశారు. 2005లో రాజశేఖర్‌రెడ్డి కొడాలి నానికి ఉపయోగపడితే.. 2009లో టికెట్ కోసం చంద్రబాబు నాయుడును ఎందుకు అడిగాడని ప్రశ్నించారు. గుడివాడ ప్రజలకు రాజశేఖరరెడ్డి మంచి చేసి ఉంటే.. 2009లో అక్కడివారు టీడీపీని ఎందుకు గెలిపిస్తారని ప్రశ్నించారు. కొడాలి నానికి నిజం మాట్లాడితే తల పగులుతుందనే శాపం ఉందేమోనని ఎద్దేవా చేశారు. 

ఇక, విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్‌పై సీఎం జగన్ ఇంతవరకు ఎందుకు స్పందించలేదని బుద్దా వెంకటన్న ప్రవ్నించారు. ఈ ఘటన కాకతాళీయంగా జరిగినట్టు డీజీపీ చెప్పడం హాస్యాస్పదమన్నారు. భూదంధాల గురించి ఆరు నెలల ముందే తాను చెప్పింది ఇప్పుడు జరిగిందన్నారు. భూదందాల వాటాలలో తేడానే ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ డ్రామా అని అన్నారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్‌ ఘటనపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణలో అసలు వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: నీళ్ళొద్దు గొడవలే కావాలిఅనే రకం వాళ్ళది: సీఎం | Asianet News Telugu
CM Chandrababu Naidu: రైతులతో కలిసి పొలానికి వెళ్లిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu