మహిళా బస్ కండెక్టర్ కి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్.. వివాదం

By ramya neerukondaFirst Published Sep 4, 2018, 10:45 AM IST
Highlights

ఈ మధ్యే కండక్టర్లకు కూడా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలొచ్చాయి. కాని విశాఖ జిల్లాలోని సింహాచలం బస్ డిపోలో ఈ టెస్ట్ నిర్వహించాల్సిన కానిస్టేబుల్ ఓవరాక్షన్ చేశాడు. పురుషులతో పాటూ మహిళా కండక్టర్‌కు కూడా బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేశాడు. 

మద్యం తాగి వాహనాలు నడిపితే.. రోడ్డు ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే మన ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టుల వద్ద వాహనాలను ఆపుతూ బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లు చేస్తూ ఉంటారు. అయితే.. ఏపీలో కేవలం ప్రజల వాహనాల మాత్రమే కాకుండా ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు కూడా ఈ టెస్ట్ లు నిర్వహిస్తున్నారు. 

ఈ మధ్యే కండక్టర్లకు కూడా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలొచ్చాయి. కాని విశాఖ జిల్లాలోని సింహాచలం బస్ డిపోలో ఈ టెస్ట్ నిర్వహించాల్సిన కానిస్టేబుల్ ఓవరాక్షన్ చేశాడు. పురుషులతో పాటూ మహిళా కండక్టర్‌కు కూడా బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేశాడు. ఈ టెస్ట్ నిర్వహిస్తుండగా తీసిన వీడియో, ఫోటో బయటపడటంతో విమర్శలొచ్చాయి. మీడియాలో కూడా వార్తలు రావడంతో ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు సీరియస్‌గా స్పందించారు. 

మహిళా సిబ్బందికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించడం సరికాదని.. కానిస్టేబుల్‌తో ఆ మహిళ కండక్టర్‌కు క్షమాపణలు చెప్పించారు. భవిష్యత్‌లో ఇలాంటివి మళ్లీ పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఘటనపై కానిస్టేబుల్ కూడా స్పందించారు. అందరిలాగే ఆమెకు టెస్ట్ చేశానని.. అలా చేసి ఉండాల్సిందని కాదన్నారు. 

click me!