సంచలనం: గుప్త నిధుల కోసం అర్థరాత్రి క్షుద్రపూజలు

Published : Nov 30, 2020, 07:54 AM ISTUpdated : Nov 30, 2020, 07:55 AM IST
సంచలనం: గుప్త నిధుల కోసం అర్థరాత్రి క్షుద్రపూజలు

సారాంశం

విజయనగరం జిల్లా బోగాపురం మండలోని ఓ గ్రామంలో కొందరు వ్యక్తులు క్షుద్రపూజలు చేశారు. గుప్త నిధులు ఉన్నాయంటూ అరణ్యంలోని కొండల్లో తవ్వకాలు ప్రారంభించి క్షుద్రపూజలు చేశారు.

విజయనగరం:  విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతంలో కొందరు వ్యక్తులు క్షుద్రపూజలకు చేశారు.  గుప్తనిధుల కోసం అర్థరాత్రి క్షద్రపూజలు నిర్వహించారు. దీంతో భయాందోళనలకు గురైన గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసుులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

విజయనగరం జిల్లా భోగాపురం మండలం గూడెం పంచాయతీ బసవ పాలెం రెవిన్యూలో దట్టమైన అరణ్య మార్గంలో కొండోడుగుట్టలో గుప్త నిధులు ఉన్నాయంటూ కొందరు తవ్వకాలు చేపట్టడం సంచలనం రేపింది. శనివారం అర్ధరాత్రి పది మంది బృందంతో ఓ ప్రదేశంలో క్షుద్ర పూజలు నిర్వహించి తవ్వకాలను ప్రారంభించారు. 

ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు వారిని పట్టుకున్నారు. రెవెన్యూ, భూగర్భ గనుల శాఖ ఆధ్వర్యంలో సుమారు పదిహేను అడుగుల లోతు తవ్వకాలు చేపట్టి అక్కడ ఏమీ లేదని రుజువు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీధర్ తెలియజేశారు.

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu