సత్య హరిశ్చంద్రుడి మనవడిలా సీఎం రమేష్ మాటలు:జీవీఎల్

Published : Oct 15, 2018, 03:33 PM IST
సత్య హరిశ్చంద్రుడి మనవడిలా సీఎం రమేష్ మాటలు:జీవీఎల్

సారాంశం

టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నిప్పులు చెరిగారు. ఐటీ అధికారులు సోదాలు జరపడంతో సీఎం రమేష్ సత్యహరిశ్చంద్రుడుకి మనవడిలా మాట్లాడుతున్నారని ఘాటుగా విమర్శించారు. ఐటీ దాడులు ఒక్క ఏపీలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయని చెప్పారు. టీడీపీ నేతలు రాజకీయ ఆరోపణలు చేసి తప్పించుకోవాలని చూస్తున్నారని జీవీఎల్  విమర్శించారు. 

ఢిల్లీ: టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నిప్పులు చెరిగారు. ఐటీ అధికారులు సోదాలు జరపడంతో సీఎం రమేష్ సత్యహరిశ్చంద్రుడుకి మనవడిలా మాట్లాడుతున్నారని ఘాటుగా విమర్శించారు. ఐటీ దాడులు ఒక్క ఏపీలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయని చెప్పారు. టీడీపీ నేతలు రాజకీయ ఆరోపణలు చేసి తప్పించుకోవాలని చూస్తున్నారని జీవీఎల్  విమర్శించారు. 

టీడీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఐటీ సోదాలను రాజకీయం చేయొద్దని సూచించారు. టీడీపీ తనకు తాను క్లీన్ చీట్ ఇచ్చుకోవడం కాదని ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముందస్తు సమాచారంతో అంతా సర్దుకున్నామని సీఎం రమేష్ అంటున్నారని జీవీఎల్ ఆరోపించారు.

తెలుగుదేశం పార్టీ అవినీతికి పాల్పడి ప్రతిపక్షానికి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని ఆరోపించారు. రాజకీయాలను టీడీపీ మార్కెట్ చేసిందని మండిపడ్డారు.  
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : చలి తగ్గినా ఈ ప్రమాదం ఇంకా పొంచివుంది.. తస్మాత్ జాగ్రత్త
AP Food Commission Chairman: అధికారులకు చుక్కలు చూపించిన ఫుడ్ కమీషన్ చైర్మన్| Asianet News Telugu