ఏపీలో సినిమా క్లైమాక్స్, రేపు హీరో వస్తున్నారు: జీవీఎల్ నరసింహారావు

Published : Feb 09, 2019, 09:18 PM IST
ఏపీలో సినిమా క్లైమాక్స్, రేపు హీరో వస్తున్నారు: జీవీఎల్ నరసింహారావు

సారాంశం

మోదీ సభకు బీజేపీయే ఖర్చు భరిస్తుందని తెలిపారు. కానీ చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేపట్టబోతున్న ధర్మపోరాట దీక్షకు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు ప్రచార ఆర్భాటం ఎక్కువ అని అందుకు ఎంత డబ్బు అయినా తగలేస్తారని ఘాటుగా విమర్శించారు. 

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకోవాలని పిలుపునివ్వడం సిగ్గు చేటని విమర్శించారు. మోదీకి భయపడే చంద్రబాబు అడ్డుకోవాలని పిలుపునిచ్చారని ఆరోపించారు. 

ప్రధాని వస్తున్నప్పుడు ప్రోటోకాల్ పాటించడం కనీస ధర్మమని హితవు పలికారు. బాబు పాలనలో స్వార్థం తప్ప విశ్వసనీయత లేదని ధ్వజమెత్తారు. ఏపీలో సినిమా క్లైమాక్స్ కు చేరుకుందన్నారు. ఆదివారం హీరో రాబోతున్నారంటూ మోడీని ప్రశంసించారు. 

మోదీ సభకు బీజేపీయే ఖర్చు భరిస్తుందని తెలిపారు. కానీ చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేపట్టబోతున్న ధర్మపోరాట దీక్షకు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు ప్రచార ఆర్భాటం ఎక్కువ అని అందుకు ఎంత డబ్బు అయినా తగలేస్తారని ఘాటుగా విమర్శించారు. 

చంద్రబాబు నాయుడుది ప్రచారమే తప్ప పాలన పట్టదని తప్పుబట్టారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో చంద్రబాబుది మెుదటి స్థానంలో ఉన్నారంటూ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. 

PREV
click me!

Recommended Stories

బాబుకు కొత్త బిరుదు ఇచ్చిన నిమ్మల | Nimmala Ramanaidu Speech | Asianet Telugu
Nara Lokesh VS Varma | CM Chandrababu Naidu | Asianet Telugu