రోడ్ల దుస్థితిపై రేపు ఏపీలో రహదారుల దిగ్భంధనం: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

By narsimha lodeFirst Published Dec 4, 2020, 3:21 PM IST
Highlights

 కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పట్టించడానికి వైసీపీ ప్రాధాన్యత ఇస్తోందని బీజెపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన రహాదారుల అధ్వాన్నస్థితిపై బీజేపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. రేపు 10 గంటలకు రాష్ట్రంలో ప్రధాన రహాదారులను దిగ్భంధం చేయనున్నట్టు చెప్పారు.


అమరావతి: కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పట్టించడానికి వైసీపీ ప్రాధాన్యత ఇస్తోందని బీజెపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన రహాదారుల అధ్వాన్నస్థితిపై బీజేపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. రేపు 10 గంటలకు రాష్ట్రంలో ప్రధాన రహాదారులను దిగ్భంధం చేయనున్నట్టు చెప్పారు.

ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా  ఆయన పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం మీద  ప్రజలకే కాదు కాంట్రాక్టర్లకు కూడ  నమ్మకంలేదన్నారు. 
ఏపీలో 4వేల కోట్లకు టెండర్లు పిలిచినా కూడ పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రాని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు విసీఐసీ ద్వారా నిర్వహణకు సొమ్ము ఇస్తే పక్కదారి పట్టించారని ఆయన ఆరోపించారు.పీఎంజీవై ద్వారా  రూ. 723 కోట్లు ఇస్తే ఈ నిధులను  దారి మళ్ళించారని ఆయన ఆరోపించారు.

సంబంధిత శాఖ నుంచి యుటిలైజేషన్ సర్టిఫికేట్ రాకపోవడంతో నిధులు ఆగిపోయాయన్నారు. బ్యాంకులు కూడా ఏపీకి  డబ్బులు ఇవ్వాలంటే భయపడుతున్నాయని చెప్పారు. ఎంఎస్ఎంఈ కింద సొమ్ములు ఆగిపోయాయన్నారు.

పంచాయితీరాజ్ లో రూ. 900 కోట్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. దాదాపు 5000 కోట్లు కాంట్రాక్టర్లకు రాజకీయ కారణాలతో బిల్లులు చెల్లింపులు చేయడం లేదని చెప్పారు. అవినీతి జరిగితే  చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరోజు పని చేసిన అధికారులు మీ ప్రభుత్వంలో కూడ ఉన్నారని ఆయన గుర్తు చేశారు.

18 నెలలుగా అవినీతికి పాల్పడిన అధికారులు, రాజకీయ నేతలపై  ఎందుకు చర్యలు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.కాంట్రాక్టర్లు కూడా అత్మహత్యకు సిద్ధంగా ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ధికమంత్రి సొంత ఊళ్ళో కాంట్రాక్టర్లు నిరసనకు దిగారని ఆయన చెప్పారు.

click me!