ఆ యాప్ గురించి రహస్యం ఎందుకు, నిమ్మగడ్డది బాధ్యత: విష్ణువర్ధన్ రెడ్డి

Published : Jan 30, 2021, 12:48 PM IST
ఆ యాప్ గురించి రహస్యం ఎందుకు, నిమ్మగడ్డది బాధ్యత: విష్ణువర్ధన్ రెడ్డి

సారాంశం

ఎన్నికల యాప్ గురించి ఎందురు రహస్యం పాటిస్తున్నారని బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. దాని గురించి స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ఉందని ఆయన అన్నారు.

అనంతపురం: పంచాయతీ ఎన్నికల యాప్ విషయాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల సెల్‌  పర్యవేక్షణలో ఉందా, తయారైందా లేదా అనే విషయం ప్రకటిస్తే ఇంకా మంచిదని ఆయన అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన యాప్ మీద స్పందించారు.

ఒక వేళ ఉంటే ఈ’యాప్‌’కు రికార్డింగ్‌మెసేజ్‌లు, ఫొటోలు, పిర్యాదులుపంపవచ్చునా అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ఏన్నికల సంఘం లాగా ఈయాప్‌ ద్వారా అందే ఫిర్యాదులను మీరు పరిగణనలోకి తీసుకుంటారా అని అడిగారు. 

సహజంగా ఇలాంటి టెక్నాలజీ వ్యవస్థల్ని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ (NITC)గానీ, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ విభాగం నిర్వహిస్తుందని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల కోసం ప్రత్యేక యాప్‌ను ఎవరు తయారు చేశారని ఆయన అడిగారు.  

3249 గ్రామాల్లో ఫిబ్రవరి 9వ తేదీన్ల పోలింగ్‌ కూడా జరగబోతుందని,  కొందరు దీనిమీద ఓక రాజకీయ పార్టీ తయారు చేసిన యాప్ అని ఇప్పటికే సామూజిక మాధ్యమాలలోప్రచారంచేస్తున్నారని ఆయన అన్నారు. వాస్తవం ఏంటో బహిరంగంగా ప్రజలకు వెంటనే తెలియజేయాల్సిన బాద్యత రాష్ట్ర ఎన్నికల కమీషన్ మీద ఉందని ఆయన ఆయన అన్నారు.

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu