ఆపరేషన్ గరుడా..పెరుగు వడా అంటున్న బీజేపీ నేత

Published : Sep 14, 2018, 05:13 PM ISTUpdated : Sep 19, 2018, 09:25 AM IST
ఆపరేషన్  గరుడా..పెరుగు వడా అంటున్న బీజేపీ నేత

సారాంశం

బాబ్లీ పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు మరో సరికొత్త నాటకానికి తెరలేపారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దుకాణం బంద్‌ అవ్వడంతో ఉనికిని కాపాడుకునేందుకు, ఓట్లు దండుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారంటూ విమర్శించారు. 

అనంతపురం : బాబ్లీ పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు మరో సరికొత్త నాటకానికి తెరలేపారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దుకాణం బంద్‌ అవ్వడంతో ఉనికిని కాపాడుకునేందుకు, ఓట్లు దండుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారంటూ విమర్శించారు. చంద్రబాబు నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వెనుక బీజేపీ హస్తం ఉందన్న ఆరోపణలను విష్ణువర్థన్ రెడ్డి ఖండించారు. 

 బాబ్లీ ఘటనలో కేసు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు కోర్టుకు హాజరు కాకపోతే అరెస్టు వారెంట్‌ వస్తుందన్న విషయం తెలీదా అంటూ విష్ణువర్థన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంటు పేరిట తెలంగాణ ప్రజల సానుభూతి పొందేందుకు బాబు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

మరోవైపు సినీనటుడు శివాజీపైనా విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. శివాజీ టీడీపీ పెయిడ్‌ ఆర్టిస్ట్‌ అన్న ఆయన ఆపరేషన్‌ గరుడా.. పెరుగు వడా అంటూ విమర్శించారు. శివాజీ ఆపరేషన్ గరుడా..పెరుగు వడా అంటూ చేసిన ఫిర్యాదుపై విచారణ ఎందుకు చేపట్టలేదంటూ ఎద్దేవా చేశారు. 

టీడీపీ ముసుగు ధరించిన వ్యక్తి శివాజీ అని ఆయన నాటకాలు ఎవరూ నమ్మరన్నారు. అయినా సిల్లీ గల్లీ కేసులకు సుప్రీంకోర్టు న్యాయవాదులు ప్రజల సొమ్ము లక్షల రూపాయలు వెచ్చిస్తారా అంటూ ప్రశ్నించారు.

PREV
click me!

Recommended Stories

AP Municipal Elections 2026 : టీడీపీ మేయర్, మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థులు వీళ్లే...
Kotamreddy Sridhar Reddy Serious Warning to YS Jagan | Punganur Incident | TDP Vs YCP