టీడీపీని భూస్థాపితం చేయం.. ప్రజావేదిక కూల్చకుండా ఉండాల్సింది: పురంధేశ్వరి

By Siva KodatiFirst Published Jun 27, 2019, 3:23 PM IST
Highlights

టీడీపీ నుంచి వలసలు కొనసాగుతాయన్నారు బీజేపీ నేత పురందేశ్వరి. తూర్పుగోదావరి జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. టీడీపీ వాళ్లను తాము రమ్మని కోరడం లేదని.. ఆ పార్టీని భూస్థాపితం చేయాలన్నది లక్ష్యం కాదని ఆమె స్పష్టం చేశారు

టీడీపీ నుంచి వలసలు కొనసాగుతాయన్నారు బీజేపీ నేత పురందేశ్వరి. తూర్పుగోదావరి జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. టీడీపీ వాళ్లను తాము రమ్మని కోరడం లేదని.. ఆ పార్టీని భూస్థాపితం చేయాలన్నది లక్ష్యం కాదని ఆమె స్పష్టం చేశారు.

ఇక ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని తేల్చి చెప్పారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను జగన్ పక్కదోవ పట్టించవద్దని ఆమె హితవు పలికారు.

అనధికారిక కట్టడాలను ఎవరైనా కూల్చివేయాల్సిందేనన్న ఆమె.. ప్రజావేదికను కూల్చకుండా ప్రజావసరాల కోసం వినియోగించి ఉంటే బావుండేదని పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో అంతులేని అవినీతి జరిగిందని.. అందుకే ప్రజలు టీడీపీని తిరస్కరించారని ఆమె పేర్కొన్నారు.

మోడీ రెండోసారి ప్రధాని అవ్వకుండా విపక్షాలన్నీ కుట్రలకు పాల్పాడ్డాయని, మరోసారి అధికారంలోకి రాదని చంద్రబాబు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. అయినా ప్రజలు మోడీ నమ్మి.. మరోసారి నరేంద్రమోడీకే పట్టం కట్టారని పురంధేశ్వరి తెలిపారు. 

click me!