చంద్రబాబు పై మరోసారి మండిపడ్డ జీవీఎల్

Published : Oct 31, 2018, 03:11 PM IST
చంద్రబాబు పై మరోసారి  మండిపడ్డ జీవీఎల్

సారాంశం

రెండో బ్రహ్మం శివాజీ చెప్పినట్లు చంద్రబాబు నడుచుకుంటున్నారని జీవీఎల్ వ్యాఖ్యానించారు.

బీజేపీ రాజ్యసభ సభుడు జీవీఎల్ నరసింహారావు.. మరోసారి  చంద్రబాబుపై మండిపడ్డాడు. రాజకీయ ముసుగులో చంద్రబాబు అవినీతికి తెరలేపారని ఆయన ఆరోపించారు. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా కడప నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జీవీఎల్ ప్రారంభించారు. పెద్ద ఎత్తున బీజేపీ నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ... ఐటీ సోదాలకు సీఎం రమేష్ బెంబేలెత్తిపోతున్నారని విమర్శించారు. టీడీపీ నేతలు సక్రమంగా పన్నులు కడితే భయమెందుకు? అని ప్రశ్నించారు.అఖిలేష్ యాదవ్ కేక వేస్తే చాలు చంద్రబాబు ఢిల్లీకి పరుగులు పెడుతున్నారని ఎద్దేవాచేశారు. ఏపీలో తెలుగుదేశానికి ఒక్క ఎంపీ సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. 

దీక్షల పేరుతో ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో మీటింగ్‌లు పెట్టడం తప్ప అభివృద్ధి కార్యక్రమాలు లేవని చెప్పారు. ప్రభుత్వం సరైన రిపోర్ట్ ఇవ్వకపోవడం వల్లే కడప ఉక్కు పరిశ్రమ ఆలస్యం అవుతుందని వివరించారు. ఇకనైనా చంద్రబాబు సొంత స్క్రిప్టులు రాసుకోవడం మానుకోవాలని సూచించారు. రెండో బ్రహ్మం శివాజీ చెప్పినట్లు చంద్రబాబు నడుచుకుంటున్నారని జీవీఎల్ వ్యాఖ్యానించారు.

PREV
click me!

Recommended Stories

వొళ్ళు గగురు పుట్టే విన్యాసాలతో అదరగొట్టిన పోలీస్ సిబ్బంది | Nara Lokesh | Independence Day | Stunts
ఈ బైకర్ విన్యాసాలకి మంత్రి నారా లోకేష్ ఫిదా | Nara Lokesh Particepate Independence Day Celebrations