మోడీ ప్రతినిధిగా మాట్లాడుతున్నా: అమరావతిపై తేల్చేసిన సోము వీర్రాజు

By narsimha lodeFirst Published Dec 14, 2020, 2:29 PM IST
Highlights

అమరావతిలోనే రాజధాని ఉండాలి, ఇందులో రెండో అంశానికి తావు లేదని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తేల్చేశారు.

అమరావతి:  అమరావతిలోనే రాజధాని ఉండాలి, ఇందులో రెండో అంశానికి తావు లేదని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తేల్చేశారు.సోమవారం నాడు గుంటూరు జిల్లా తుళ్లూరులో భారతీయ కిసాన్ సంఘ్ నిర్వహించిన రైతుల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో అమరావతి గురించి ఆయన బీజేపీ వైఖరిని తేల్చి  చెప్పారు.

రాష్ట్రంలో మూడు రాజధానులను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. బీజేపీ ఏపీ కార్యాలయాన్ని విజయవాడలోనే కడుతున్నామన్నారు.  రూ. 1800 కోట్లతో నిర్మితమౌతున్న ఎయిమ్స్ ఆసుపత్రి ఆగిందా అని ఆయన ప్రశ్నించారు

దుర్గమ్మ ఫ్లైఓవర్ పూర్తి చేశామా లేదా అని అడిగారు. మోడీ ప్రతినిధిగా మాట్లాడుతున్నాను.. జగన్ మాదిరిగా తాము మాట తప్పబోమన్నారు. మాట తప్పే పార్టీ కాదన్నారు. అమరావతి ఇక్కడే ఉండాలి, దీని కోసం బీజేపీ తరపున ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు.

2024లో బీజేపీకి ఏపీలో అధికారం ఇవ్వండి, అమరావతిని బాగా అభివృద్ది చేసి చూపిస్తామన్నారు.ఆందోళన చేస్తున్న రైతు నాయకులతో మాట్లాడాలన్నారు. రాజధానితో పాటు రైతులకు ఇచ్చిన ప్లాట్లను అభివృద్ది చేయాలని ఆయన కోరారు. 64 వేల ప్లాట్లు పోగా మిగిలిన భూమిని అభివృద్ది చేయాలన్నారు.

రాష్ట్రంలో అభివృద్ది మోడీ వల్లే జరిగిందన్నారు. 2024లో మాకు అధికారంఇస్తే అమరావతిని రూ. 5 వేల కోట్లతో అభివృద్ది చేస్తామన్నారు. రైతుల ప్లాట్లకు రూ, 2 వేల కోట్లతో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
 

click me!