నారా లోకేష్ కి చేదు అనుభవం.. అడ్డుకున్న గ్రామస్థులు

Published : Dec 06, 2018, 12:37 PM IST
నారా లోకేష్ కి చేదు అనుభవం.. అడ్డుకున్న గ్రామస్థులు

సారాంశం

స్థానిక మహిళలంతా ఖాళీ బిందెలతో వచ్చి లోకేష్ కాన్వాయిని అడ్డుకొని అక్కడే కూర్చున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తాము తాగు నీటి సమస్యతో బాధపడుతున్నామని ఈ సందర్భంగా వారు లోకేష్ కి వివరించారు.

ఏపీ మంత్రి నారా లోకేష్ కి చేదు అనుభవం ఎదురైంది.  పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం బియ్యపుతిప్పలో బుధవారం రాత్రి ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడానికి లోకేష్ అక్కడికి వచ్చారు.

కాగా.. అక్కడకు వచ్చిన మంత్రి లోకేష్ ని గ్రామస్థులు అడ్డుకున్నారు. స్థానిక మహిళలంతా ఖాళీ బిందెలతో వచ్చి లోకేష్ కాన్వాయిని అడ్డుకొని అక్కడే కూర్చున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తాము తాగు నీటి సమస్యతో బాధపడుతున్నామని ఈ సందర్భంగా వారు లోకేష్ కి వివరించారు.

పూర్తిగా ఉప్పునీటి మయమైన తమ ప్రాంతానికి పక్క గ్రామమైన వేములదీవి నుంచి పైపులైను ద్వారా నీరు సరఫరా అవుతున్నప్పటికీ.. అవి కూడా తరచూ పైపులైన్లు పాడై నీరు ఉప్పగా ఉంటుందని చెప్పారు.  అదికూడా రెండు రోజులకోసారి కేవలం అరగంట పాటు మాత్రమే ఇస్తున్నందువల్ల పూర్తి స్థాయిలో తాగునీటి అవసరాలు తీరడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరిస్తానని మంత్రి లోకేష్‌ హామీ ఇవ్వడంతో కాలనీ వాసులు శాంతించారు. అనంతరం కాన్వాయ్‌ ముందుకు సాగింది.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్