ఎన్నికల బరిలో బిగ్ బాస్ కౌశల్.. టీడీపీ టికెట్ ఖరారు?

Published : Feb 25, 2019, 01:53 PM IST
ఎన్నికల బరిలో బిగ్ బాస్ కౌశల్.. టీడీపీ టికెట్ ఖరారు?

సారాంశం

ఏపీలో ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. దీంతో అన్ని పార్టీల అదిష్టానాలు అభ్యర్థుల జాబితాపై దృష్టి కేంద్రీకరించాయి. 

ఏపీలో ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. దీంతో అన్ని పార్టీల అదిష్టానాలు అభ్యర్థుల జాబితాపై దృష్టి కేంద్రీకరించాయి.  ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తే... పార్టీ గెలుస్తుందనే దానిపై సర్వే చేయించి మరీ.. టికెట్లు కేటాయిస్తున్నారని సమాచారం. కాగా.. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఇటీవల ఓ టీవీ ఛానల్ లో ప్రసారమైన బిగ్ బాస్ షో2 విన్నర్ గా నిలిచిన కౌశల్.. ఈ ఎన్నికల బరిలో టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.

అనకాపల్లి నియోజకవర్గాన్ని కాపు సామాజిక వర్గానికి కేటాయిస్తే..బాగుంటుందని టీడీపీ నేతలు ఆలోచిస్తున్నారట. దీంతో.. కౌశల్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కూడా.. ఈ టికెట్ ఆశిస్తుండగా.. కౌశల్ కూడా పోటీకి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.  

PREV
click me!

Recommended Stories

ఉదయగిరిలో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | Palle Panduga 3.0 | Pawan Kalyan | Asianet News Telugu
పల్లె పండుగ 3.0లో BJP చీఫ్ PVN మాధవ్ స్పీచ్ | Chandrababu | Pawan Kalyan | Asianet News Telugu