తిరుపతిలో ఏడు అడుగుల భారీ నాగుపాము..!

By telugu news teamFirst Published Jan 2, 2021, 11:30 AM IST
Highlights

విద్యుత్ శాఖక భవనంలోకి భారీ నాగుపాము దూరింది. కాగా.. దానిని వెంటనే గుర్తించిన ఆలయ సిబ్బంది.. అటవీ శాఖ ఉద్యోగి భాస్కర్ నాయుడికి సమాచారమిచ్చారు.
 

కలియుగ దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నాగుపాము కలకలం సృష్టించింది. జీఎన్ సీ టోల్ గేట్ సమీపంలోని విద్యుత్ శాఖక భవనంలోకి భారీ నాగుపాము దూరింది. కాగా.. దానిని వెంటనే గుర్తించిన ఆలయ సిబ్బంది.. అటవీ శాఖ ఉద్యోగి భాస్కర్ నాయుడికి సమాచారమిచ్చారు.

వెంటనే ఆయన అక్కడకు వచ్చి చాకచక్యంగా ఏడడుగుల నాగుపామును పట్టుకున్నారు. అనంతరం దానిని శేషాచల అటవీప్రాంతంలోని అవ్వాచారి కోనలో విడిచిపెట్టారు. కాగా.. తిరుమల ఆలయంలోకి పాము అడుగుపెట్టడం ఇదేమీ తొలసారి కాదు. చాలా సార్లు పాములు కలకలం సృష్టించాయి. అయితే.. ఇంత పెద్ద పాము రావడం తొలిసారి కావడం గమనార్హం. పాముని చూసి తొలుత ఆలయ సిబ్బంది భయంతో వణికిపోయారు. 

కాగా.. ఇటీవల కూడా ఓసారి ఆలయ ప్రాంగణంలోకి ఓ పాము వచ్చింది. ఆలయ ప్రాంగణంలో పాము కనిపించడంతో భక్తులు భయపడ్డారు.. అక్కడి నుంచి పరుగులు తీశారు. వెంటనే విషయం తెలుసుకున్న ఆలయ సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది పామును పట్టుకున్నారు. అనంతరం ఆ పామును అటవీ ప్రాంతంలో వదిలేశారు. అధికారులు వెంటనే స్పందించడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

click me!