కాషాయం దుస్తుల్లో ఎన్టీఆర్.. దాని వెనక స్వామి అగ్నివేష్

By telugu news teamFirst Published Sep 12, 2020, 11:55 AM IST
Highlights

ఓ రోజు హక్కుల ఉద్యమంలో భాగంగా స్వామి అగ్నివేశ్‌ ఒకసారి ఏపీకి వచ్చారు. అప్పుడు ఏపీ సీఎంగా ఉన్న ఎన్టీ రామారావు వద్దకు వెళ్లారు. కాషాయ వస్త్రాల్లో అగ్నివేశ్‌ను చూసి.. ‘మీరు సన్యాసం ఎందుకు తీసుకున్నారు?’ అని ఎన్టీయార్‌ అడిగారు


సినీ నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎన్టీఆర్..  కొంతకాలం కాషాయం దుస్తులు ధరించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎన్నికల ప్రచారంలోనూ.. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయన కాషాయ దుస్తుల్లో కనిపించారు. అయితే.. ఆయన అలా కనిపించడానికి ఓ కారణం ఉందట.  ఓవ్యక్తి చెప్పిన మాటల ప్రభావంతో ఎన్టీఆర్ అలా ఆ దుస్తుల్లోకి మారిపోవడం గమనార్హం.

ప్రముఖ సంఘ సేవకుడు స్వామి అగ్నివేశ్(80) ఓ రోజు హక్కుల ఉద్యమంలో భాగంగా స్వామి అగ్నివేశ్‌ ఒకసారి ఏపీకి వచ్చారు. అప్పుడు ఏపీ సీఎంగా ఉన్న ఎన్టీ రామారావు వద్దకు వెళ్లారు. కాషాయ వస్త్రాల్లో అగ్నివేశ్‌ను చూసి.. ‘మీరు సన్యాసం ఎందుకు తీసుకున్నారు?’ అని ఎన్టీయార్‌ అడిగారు. ‘సన్యాసిగా ఉంటే ఎలాంటి స్వార్థం ఉండదు. మన కోసం కాకుండా ఇతరులు, సమాజం కోసం పనిచేస్తాం. మీరూ నిజాయితీగా పనిచేయండి. సన్యాసం తీసుకోండి’ అని ఎన్టీయార్‌కు అగ్నివేశ్‌ సమాధానమిచ్చారు. అగ్నివేశ్‌ మాట ప్రభావమో లేక మరే ఇతర కారణమో.. ఎన్టీయార్‌ ఆ తర్వాతి కాలంలో కొన్నాళ్లపాటు కాషాయం ధరించారు.

ఇదిలా ఉండగా.. స్వామి అగ్నివేశ్.. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా లివర్‌ సిర్రోసిస్‌ వ్యాధితో ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన మంగళవారం నుంచి వెంటిలేటర్‌పైనే ఉన్నారని ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బిలియరీ సైన్సెస్‌ తెలిపింది. శుక్రవారం సాయంత్రం ఆరుగంటల సమయంలో గుండెపోటు వచ్చిందని 6.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.
 

click me!