బనగానపల్లె అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

Siva Kodati |  
Published : Mar 21, 2024, 03:07 PM ISTUpdated : Mar 21, 2024, 03:08 PM IST
బనగానపల్లె అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

సారాంశం

నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా 2009లో బనగానపల్లె ఏర్పడింది. కోవెలకుంట్ల అసెంబ్లీ పరిధిలోని 4, పాణ్యం పరిధిలోని బనగానపల్లి మండలాన్ని కలిపి బనగానపల్లె నియోజకవర్గం ఏర్పాటు చేశారు. బనగానపల్లె పేరు చెప్పగానే.. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్లెదుట మెదులుతారు. తత్వవేత్తగా, కాలజ్ఞానిగా ఆయన భక్తుల హృదయాలలో నిలిచిపోయారు. బనగానపల్లెలో చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబానిదే ఆధిపత్యం. ఇక్కడ ఆ ఫ్యామిలీకి బలమైన కేడర్ వుంది. రామకృష్ణారెడ్డి టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, వైసీపీలో ఎమ్మెల్సీగానూ పనిచేశారు. బనగానపల్లె నియోజకవర్గంలో బనగానపల్లె, కోయిలకుంట్ల, అవుకు, సంజామాల, కొలిమిగుండ మండలాలున్నాయి. కాటసాని రామిరెడ్డి రెండు సార్లు,  బీసీ జనార్ధన్ రెడ్డి ఒకసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. 

బనగానపల్లె పేరు చెప్పగానే.. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్లెదుట మెదులుతారు. తత్వవేత్తగా, కాలజ్ఞానిగా ఆయన భక్తుల హృదయాలలో నిలిచిపోయారు. కులవివక్షను, పేద , ధనిక మధ్య అంతరాలను పొగొట్టేందుకు స్వామివారు ఎంతో కృషి చేశారు. ఆధ్యాత్మికతతో పాటు రాజకీయాల పరంగానూ బనగానపల్లెకి విశిష్ట స్థానముంది. దేశానికి ఎంతోమంది నేతలను ఈ గడ్డ అందించింది. నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా 2009లో బనగానపల్లె ఏర్పడింది. కోవెలకుంట్ల అసెంబ్లీ పరిధిలోని 4, పాణ్యం పరిధిలోని బనగానపల్లి మండలాన్ని కలిపి బనగానపల్లె నియోజకవర్గం ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద గుహల్లో ఒకటైన బెలూం గుహలు ఈ ప్రాంతంలోనే వున్నాయి. రెడ్డి, శెట్టి బలిజ, ముస్లిం మైనారిటీ వర్గాలు బనగానపల్లెలో ఆధిపత్యం వహిస్తున్నాయి. 

బనగానపల్లె అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. రెడ్లదే హవా :

బనగానపల్లెలో చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబానిదే ఆధిపత్యం. ఇక్కడ ఆ ఫ్యామిలీకి బలమైన కేడర్ వుంది. రామకృష్ణారెడ్డి టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, వైసీపీలో ఎమ్మెల్సీగానూ పనిచేశారు. ఆయన కన్నుమూయడంతో చల్లా కుమారుడు భగీరథ రెడ్డికి జగన్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. అయితే భగీరథ రెడ్డి కూడా హఠాన్మరణం పాలవ్వడంతో చల్లా ఫ్యామిలీలో బలమైన నేతలు లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో భగీరథ రెడ్డి సతీమణి చల్లా శ్రీలక్ష్మీ రాజకీయాల్లో యాక్టీవ్ అయ్యారు. అయితే ఇక్కడ కాటసాని రామిరెడ్డి కుటుంబం కూడా బలంగా వుంది. 

బనగానపల్లె శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. బరిలో నిలిచింది వీరే :

బనగానపల్లె నియోజకవర్గంలో బనగానపల్లె, కోయిలకుంట్ల, అవుకు, సంజామాల, కొలిమిగుండ మండలాలున్నాయి. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,33,290 మంది. 2009లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున కాటసాని రామిరెడ్డి, టీడీపీ తరపున బీసీ జనార్ధన్ రెడ్డి, వైసీపీ తరపున కాటసాని రామిరెడ్డిలు ఎమ్మెల్యేలుగా గెలిచారు.

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి కాటసాని రామిరెడ్డికి 99,998 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి బీసీ జనార్థన్ రెడ్డికి 86,614 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 13,384 ఓట్ల తేడాతో విజయం సాధించింది. ఇక్కడ మరోసారి గెలిచి సత్తా చాటాలని సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి భావిస్తున్నారు. జగన్ ఛరిష్మ, నియోజకవర్గంలో తాను చేసిన పనులే గెలిపిస్తాయని కాటసాని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ విషయానికి వస్తే.. బీసీ జనార్థన్ రెడ్డికి మరోసారి చంద్రబాబు టికెట్ కేటాయించారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్